ktr
తెలంగాణ రాజకీయం

దారిద్రానికి నేస్తం హస్తం

యాదగిరిగుట్టకు చేరుకున్న మంత్రి కేటిఅర్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన  స్వాగతం పలికారు.
యాదగిరిగుట్ట రోడ్డు షో మంత్రి మాట్లాడుతూ 2001 నుండి కేసీఆర్ బాటలో నడిచిన వ్యక్తి సునీత. ఎత్తిన జెండా దించని రాణిరుద్రమల ఉద్యమం లో పనిచేసింది సునీత అక్క. 2014 లో ఎలా ఉంది యాదగిరిగుట్ట ఇప్పుడు ఎలా ఉంది. యాదాద్రి అద్భుతంగా పునర్నిర్మాణం ఆహాయింది. ఆలయ పునర్నిర్మాణం లో భాగంగా కొంతమందికి నష్టం జరిగింది. 3 వతేది తరువాత కొండపైకి ఆటోలు అనుమతి కి కృషి చేస్తా. కరెంట్ గురించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే సిగ్గు వేస్తుంది. ఎడ్లు, ఎవసం తెలియదు కాంగ్రెస్ వాల్లకి. పాత రోజులు కావాలంటే కాంగ్రెస్ కి ఓటు వేయండి. 24 గంటలు కరెంట్ కావాలంటే బిఆరెస్ పార్టీ కి ఓటు వేయండి. 55 సంవత్సరాలు గెలిపిస్తే ఎం పికారు. దారిద్రానికి నేస్తం హస్తం. బిఆరెస్ వచ్చాక సాగునీరు తాగునీరు కష్టం పోయింది. కరోనా కష్టం వచ్చింది.

3 వ తేదిన కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. 18 సంవత్సరాలు నిండిన  అమ్మాయిలకు  సౌభాగ్యలక్ష్మీ పథకం క్రింద  3000 అందజేస్తాం. డిసెంబర్ 3 తేదీ తరువాత సన్న బియ్యం అందజేస్తాం.  తెల్ల రేషన్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా సౌకర్యం. ప్రతి ఉరులో మాహిళ సంఘాలకు సమ్మక్క సారక్కా పేరుతో సంఘ భవనాలు నిర్మాణం చేస్తాం. ఆలేరు ని రెవెన్యూ డివిజన్ గా మారుస్తాం. కొత్తగా రెండు మండలాలకు కృషి చేస్తాం. 55 సంవత్సరాలుగా చేయాలని  పనులు 9 సంవత్సరాలలో అభివృద్ధి చేశామని అన్నారు.