ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ఏపీలో కొత్తగా 2,930 కరోనా కేసులు

ఏపీ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 90,532 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,930 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 591 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 59 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో రాష్ట్రంలో 4,346 మంది కరోనా నుంచి కోలుకోగా, 36 మంది మరణించారు. మిగతా జిల్లాలతో పోల్చితే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఆరుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 12,815కి పెరిగింది.

ఏపీలో ఇప్పటివరకు 18,99,748 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 18,51,062 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 35,871 మంది చికిత్స పొందుతున్నారు.