uttarakhand
జాతీయం రాజకీయం

హైదరాబాద్ నుంచి డ్రిల్లింగ్ మిషన్

ఉత్తరాఖండ్ రెస్క్యూ ఆపరేషన్‌  ఇంకా కొనసాగుతోంది. ఉత్తరాఖండ్లోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను మరికొన్ని గంటల్లో బయటకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. అమెరికన్ ఆగర్ డ్రిల్లింగ్ మిషన్ ద్వారా 800 మిల్లీ మీటర్ల వ్యాసం ఉన్న పైపులను 45 మీటర్ల మేర శిథిలాల గుండా సమాంతరంగా ప్రవేశపెట్టారు. గత రాత్రి స్టీల్ మెష్‌ పైపునకు అడ్డుపడడంతో పైపులైన్‌ను ప్రవేశపెట్టే ప్రక్రియ నిలిచిపోయింది. మెషన్‌ను గ్యాస్ కట్టర్‌లతో కట్ చేసి.. ఉదయానికి పూర్తిగా తొలిగించారు. ఇప్పుడు ఆఖరి పైపును శిథిలాల ద్వారా కార్మికులు ఉన్న చోటకు చేర్చారు. కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఫ్ బృందం సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు వారు ముందే ట్రయల్‌ నిర్వహించారు. ఇది ఎంతో ఆసక్తికరంగా సాగింది. ప్రత్యేకంగా తయారు చేయించిన చక్రాల స్ట్రెచర్‌ను ఆక్సిజన్ కిట్‌తో పాటు కార్మికుడికి పంపనున్నారు. స్ట్రెచర్‌పై పడుకున్న కార్మికుడిని తాళ్ల సహాయంతో బయటకు లాగనున్నారు. ఒకరి తర్వాత ఒకరిని బయటకు చేర్చేలా ప్రణాళిక పూర్తి చేశారు.

ఇందుకు విజయవంతంగా మాక్ డ్రిల్ నిర్వహించారు.ఇందుకోసం విదేశాల నుంచి నిపుణులతో పాటు అమెరికా నుంచి Augur Machine తెప్పించారు. కానీ ఆ మెషీన్‌ డ్రిల్లింగ్ చేస్తుండగానే విరిగిపోయింది. సొరంగంలోనే ఇరుక్కుపోయింది. ఇప్పుడు దాన్ని బయటకు తీసుకురావడమూ పెద్ద సవాలుగా మారిపోయింది. ఈ మెషీన్‌ని కట్ చేసేందుకు ఓ మెషీన్‌ అవసరమైంది. ఈ యంత్రాన్ని హైదరాబాద్ నుంచే తరలించారు. ప్లాస్మా కట్టర్ మెషీన్ ని ప్రత్యేకంగా హైదరాబాద్‌ నుంచి తెప్పించారు. ఓ ఛార్టర్ ఫ్లైట్‌లో ఏపీలోని రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి డెహ్రడూన్‌లోని జాలీ గ్రాంట్ ఎయిర్‌పోర్ట్‌కి తరలించారు. అక్కడి నుంచే నేరుగా సిల్‌క్యారా సొరంగం వద్దకు తీసుకెళ్లారు. మైక్రో టన్నెలింగ్ ఎక్స్‌పర్ట్ క్రిస్ కూపర్  ఈ ఆపరేషన్‌ని పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్లాస్మా కట్టర్ మెషీన్‌తో ఆగర్ మెషీన్ స్టీల్‌ని కట్ చేయనున్నారు. మరో 16 మీటర్ల మేర కట్‌ చేస్తే తప్ప ఆ మెషీన్‌ని పూర్తిగా సొరంగంలో నుంచి బయటకు తీసుకొచ్చే అవకాశం లేదని వెల్లడించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా ఈ ఆపరేషన్‌పై స్పందించారు. త్వరలోనే ఆగర్ మెషీన్‌ని బయటకు తీసుకొస్తామని వెల్లడించారు. ఆ తరవాతే మాన్యువల్ డ్రిల్లింగ్ మొదలవుతుందని వివరించారు.

ప్లాస్మా మెషీన్‌ స్టీల్‌ని చాలా తొందరగా కట్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి ప్లాస్మా కట్టర్ మెషీన్‌ని తెప్పించాం. ఉదయం నుంచి అది పని చేస్తూనే ఉంది. చాలా వేగంగా ఈ పని కొనసాగుతోంది. 14 మీటర్ల మేర ఇంకా కట్ చేయాల్సి ఉంది. ఆగర్ మెషీన్‌ని కట్ చేసి బయటకు తొలగించాల్సి ఉంటుంది. త్వరలోనే ఇది పూర్తవుతుంది. ఆ తరవాత మాన్యువల్ డ్రిల్లింగ్ మొదలవుతుందని- పుష్కర్ సింగ్ ధామి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తెలిపారు.సాంకేతికతంగా రెస్క్యూ ఆపరేషన్‌కి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇదే ఆలస్యానికి కారణమవుతోంది. ముఖ్యంగా ఆగర్ మెషీన్‌ విరిగిపోవడం పెద్ద సమస్యగా మారింది. ప్రకారం…గత 24 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్‌లో ఏ కదలికా లేదు.