జిల్లాలోని జహీరాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ రోడ్ షోలో అగ్రనేత ప్రియాంక గాంధీ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ రోడ్‌షోకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. జహీరాబాద్‌లో కార్నర్ మీటింగ్‌లో
ప్రియాంక ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పాటకు ప్రియాంక గాంధీ స్టెప్పులేసి అందరినీ ఉత్సాహపరిచారు. దొరల తెలంగాణ కావాలో… ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోవాల్సిన సమయం
వచ్చిందని ప్రియాంక అన్నారు. దేశంలో ఫామ్ హౌస్‌లో ఉండి పాలించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓవైసీ పోటీ చేస్తారని.. తెలంగాణలో అన్నిచోట్ల
ఎందుకు పోటీ చేయరని ప్రశ్నించారు.అక్రమాలతో దేశంలో బీజేపీ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ధనిక పార్టీలుగా మారాయన్నారు. రూ.16 వేల కోట్లతో విమానాలు, అదాని రుణాలు మాఫీ చేసే మోడీకి పేదల రుణాల
మాఫీ గుర్తుకు రాదని విమర్శించారు. కరోనా సమయంలో దేశ ప్రజలు అల్లాడితే మోడీ ఆదుకోవడంలో విఫలం అయ్యారన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారు.
రెండు లక్షల వరకు ఏకకాలంలో రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ 24 గంటలు పనిచేస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌కు బై బై చెప్పే సమయం ఆసన్నం
అయిందని ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు చేశారు.