కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు “చలో దామవరం” కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు నగర మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, కావలి నియోజకవర్గ పార్టీ పరిశీలకులు బొమ్మి సురేంద్ర గార్లతో కలిసి వందలాది సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం దామవరం విమానాశ్రయ భూముల్లో అడ్డు అదుపు లేకుండా జరుగుతున్న గ్రావెల్ అక్రమ రవాణాను, ఆయా గుంతలను చూపుతూ… పత్రికా విలేకరులకు వివరించారు. “సైకో సీఎం డౌన్ డౌన్”, “విమానాశ్రయ భూముల్లో జరిగిన అక్రమ గ్రావెల్ త్రవ్వకాలపై విచారణ చేపట్టాలి”,”చేతకాని సీఎం దిగిపోవాలి” అంటూ నినాదాలు చేశారు.
విమానాశ్రయ నిర్మాణానికి నారా చంద్రబాబునాయుడు గారు చేసినటువంటి పైలాన్ కు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ వై.సి.పి నాయుకులు చేస్తున్న గ్రావెల్ దోపిడీని ఖండిస్తున్నామని, ఎయిర్ పోర్టు భూముల్లోనే ఇంతటి అవినీతికి పాల్పడ్డ వైసిపి నాయకుల్ని ఏమనాలో అర్థం కావడం లేదని వాపోయారు. ఏది ఏమైనా 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది ఖాయమని… విమానాశ్రయాన్ని మేమే పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.