మహాలక్ష్మి పథకం కింద రేపట్నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో శనివారం మధ్యాహ్నం నుంచి ఉచితంగా ప్రయాణించొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.రాష్ట్ర పరిధిలో తిరిగే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. సిటీలో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు. ఇక మహిళలకు సంబంధించిన ఛార్జి మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించనుంది. త్వరలోనే మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను అందించనుంది ప్రభుత్వం. మొదటి వారం రోజుల పాటు ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండానే మహిళలకు ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. అంతర్ రాష్ట్ర బస్సుల్లో తెలంగాణ పరిధి వరకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు
Related Articles
రంగంలోకి సోనియా...ప్రతిపక్ష సమావేశానికి మమత హాజరు
అసలే పోటాపోటీగా అధికార, ప్రతిపక్ష కూటములు సమావేశాలు ఏర్పాటు చేశాయి. ఎవరికి వారుగా తమ బలాన్ని, ఐక్యతను చాటే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కూటమిలో ముఖ్య నేత ఎవరైనా హాజరుకాలేదంటే.. కారణమేదైనా సరే ఎన్నో అర్థాలు, అపార్థ…
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి సీనియర్లు
కందుకూర్ మండలం జైత్వారం, బాచుపల్లి గ్రామాల నుంచి భారీ స…
జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఘనంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు- జాతీయ జెండాను ఎగరవేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం జిహెచ్ఎంసి…