77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కమిషనర్ రోనాల్డ్ రోస్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి లతో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జాతీయ జెండా ఎగరవేశారు. అంతకు ముందు కమిషనర్, ఇ.వి.డి.ఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి లతో కలిసి మేయర్ పోలీసు వందనం స్వీకరించారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని యు.బి.డి కి చెందిన బెస్ట్ నర్సరీ, అవెన్యూ ప్లాంటేషన్ లో ఉత్తమ సేవలు అందించిన యుబిడి అధికారులకు బెస్ట్ నర్సరీ కింద ఖైరతాబాద్ జోన్ మెహిదీపట్నం సర్కిల్ కు చెందిన భీమా లక్ష్మిదేవి కున్వర్, బెస్ట్ అవెన్యూ ప్లాంటేషన్ కింద చార్మినార్ జోన్ రాజేంద్రనగర్ సర్కిల్ కు చెందిన జె.ఎస్.ప్రసన్న కుమార్, ఖైరతాబాద్ జోన్ జూబ్లీహిల్స్ సర్కిల్ కు చెందిన కె.బాలయ్య (సర్కిల్ మేనేజర్), శేరిలింగంపల్లి జోన్ కు చెందిన మహమ్మద్ యూసుఫ్ పాషా (సర్కిల్ మేనేజర్) లకు ప్రశంసా పత్రాలను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఇ.ఎన్.సి జియా ఉద్దీన్, అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరీష్, సరోజ, విజయలక్ష్మి, వి.కృష్ణ, జయరాజ్ కెనడీ, యాదగిరిరావు, ఉపేందర్ రెడ్డి, గీతా మాధవి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.పద్మజ, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రె, చీఫ్ ఎంటమాలజి డా.రాంబాబు, చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర రెడ్డి, ఎస్.ఆర్.డి.పి సి.ఇ దేవానంద్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎస్.ఇ కోటేశ్వరరావు, హౌసింగ్ ఎస్.ఇ విద్యాసాగర్, ఇ.వి.డి.ఎం అడిషనల్ ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి, డి.ఎస్.పి సుదర్శన్ రెడ్డి, ఇ.ఇ శ్రీనివాస్ రెడ్డి, ఎస్టేట్ డైరెక్టర్ భాషా, జాయింట్ కమిషనర్లు మంగతాయారు, శశిరేఖ, ఉమా ప్రకాష్, సంధ్య, సెక్రటరీ లక్ష్మి, ఓ.ఎస్.డి అనురాధ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ… ఎస్.ఆర్.డి.పి: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజారవాణాను మెరుగు పరిచేందుకు ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 48 పనులలో 35 పనులు పూర్తయ్యాయి. అందులో 19 ఫ్లైఓవర్లు, 7 ఆర్.ఓ.బి లు, 5 అండర్ పాస్ లు పూర్తి అయ్యాయి. సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థ ద్వారాచేరవలసిన గమ్యస్థానానికి కాలుష్య రహితంగా సకాలంలో వెళ్లడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 450 కోట్ల వ్యయంతో చేపట్టిన ఇందిరాపార్కు నుండి ఆర్.టి.సి క్రాస్ రోడ్డు మీదుగా వి.ఎస్.టి వరకు మొదటి దశలో స్టీల్బ్రిడ్జి అందుబాటులోకి రానున్నందున ట్రాఫిక్ సమస్య తీరుతుంది. మిగతా 13 పనులను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు