malla reddy
తెలంగాణ రాజకీయం

మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

మాజీ మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్ జిల్లా షామీర్ పేట పోలిస్ స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్ నమోదు అయింది. మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామంలోని 33,34,35 సర్వ్ నెంబర్ లోని  47 ఎకరాల 18 గుంటల గిరిజనుల భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేసారంటూ  బాధితులు  ఫిర్యాదు చేసారు. దాంతో పోలీసులు ఎస్సి, ఎస్టి, 420 కింద కేసులు నమోదు చేసారు. బాధితులు మంత్రి చామకూర మల్లారెడ్డి అని ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ పోలీసులు మాత్రం మల్లారెడ్డి అని ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొనడంపై బాధితులు  మండిపడుతున్నారు. అర్ధరాత్రి గిరిజనుల భూములు రిజిస్ట్రేషన్ చేసిన తహశిల్దార్ పై కూడా కేసు నమోదు చెయ్యాలని బాధితులు  డిమాండ్ చేసారు.మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (డిసిఏంఎస్)జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ శామీర్‌పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ 420 చీటీంగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.