lagadapati
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

రీ ఎంట్రీ లగడపాటి..

లగడపాటి రాజగోపాల్. తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరు. విజయవాడ ఎంపీగా, ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే 2018లో జరిగిన తెలంగాణ ఎన్నికలు, 2019లో జరిగిన ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాని కూడా ప్రకటించారు. అప్పడప్పుడు ఏదైనా ప్రైవేట్ కార్యక్రమాల్లో మాత్రం కనిపిస్తున్నారు.. రాజకీయపరమైన అంశాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా లగడపాటి పాలిటిక్స్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం. వచ్చే ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని లగడపాటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ నుంచి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు. గుంటూరు నుంచి ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెబుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో…అక్కడ నుంచే లగడపాటి ఎంపీగా పోటీ చేస్తారని చెబుతున్నారు. ఈయనకు గల్లా మద్దతు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గుంటూరులో గల్లా రెండు పర్యాయాలుగా గెలుస్తున్నారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాక కూడా లగడపాటి ద్వారా గుంటూరు ఎంపీ స్థానాన్ని మరోసారి గెలవాలని అనుకుంటోంది టీడీపీ.