పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లో సింగిరెడ్డి పల్లి,చందన పూర్,మంగల్పల్లి,పెద్ధం పెట్, ముస్త్యాల,సుందిల్ల సింగరేణి ప్రభావిత గ్రామాల నిరుద్యోగ యువత ఈరోజు తెలంగాణ ఐ టి శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు రామగిరి మండల కన్వీనర్ పెర మహేశ్వర్ రావు ఆధ్వర్యంలో ప్రైవేట్ ఒబి కంపనీలైన అర్ వి అర్,పి సి పటేల్ కంపెనీ యాజమాన్యాలను కలిసి స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలని ప్రభావిత గ్రామాల నిరుద్యగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని అలాగే భూములు కోల్పోయి ఉపాధి కోల్పోతున్న ప్రభావిత గ్రామ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం తన మన అనుకున్న వాళ్ళకే ఉద్యోగాలు కల్పించారు మరియు ఒక కంపెనీలో ఉద్యోగం కావాలి అంటె 50 నుండి లక్ష వరకు వసూలు చేశారు. అధికారం ఉంది అని వాళ్ళు అడింది ఆట పాడింది పాటగా మారి ప్రభావిత గ్రామ నిరుద్యోగులను నిండా ముంచారు.బి ఆర్ ఎస్ కండువా కప్పుకుంటేనే ఉద్యోగం అంటూ గ్రామాల ప్రజా ప్రతినిదులు బెదిరింపులకు పాల్పడుతూ నియంత పాలన కొనసాగించారు.
కనీసం ఇప్పటికైనా గడిల పాలన పోయి ప్రజల పాలన అందించే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ఇకనుండి అయిన పార్టీలకు అతీతంగా ప్రభావిత గ్రామ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ రామగిరి మండల కన్వీనర్ పేరాల మహేశ్వర్ రావు సుందిల్ల ఎం పి టి సి జనగామ హేమలత బుచ్చిబాబు, ముస్త్యాల సర్పంచ్ రామగిరి లావణ్య నాగరాజు, ఎన్ ఎస్ యు ఐ నాయకుడు ఈగ ప్రశాంత్, సుందిల్ల మాజీ సర్పంచ్ మర్కా స్వామీ,సింగిరెడ్డి పల్లి మాజీ ఎంపీటీసీ ఎలువాక ఓదెలు, ముస్త్యాల మాజీ సర్పంచ్ రాజేశ్వరరావు,ఎన్ ఎస్ యు ఐ నాయకుడు ముస్త్యాల గ్రామ అధ్యక్షుడు కృష్ణ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు జనగామ రామస్వామి. ముస్కుల నరేందర్ రెడ్డి,వేముల సతీష్,హరీష్ రెడ్డి, మరియు కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగ యువకులు,తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.