వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన వ్యూహం సినిమాపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమా రిలీజ్ పై స్టే ఇవ్వాలని ధర్మసనాన్ని కోరారు పిటీషనర్ న్యాయవాది. అయితే స్టే కి హైకోర్టు నిరాకరించింది.
ఈనెల 28న మరోసారి విచారించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది హైకోర్టు. 28న వాదనలు వినిపిస్తామని ప్రొడ్యూసర్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టుకి విన్నవించారు. అయితే టిడిపి తరఫున వాదనలు వినిపించిన మురళీధర్ రావు పలు కీలక ఆరోపణలు చేశారు. వ్యూహం సినిమా కేవలం పొలిటికల్ అజెండాతోనే రూపొందించారని.. టిడిపి, జనసేన, కాంగ్రెస్ నాయకులను డీ ఫేమ్ చేసేలా ఈ సినిమా తీశారని ఆరోపించారు.