జాతీయం ముఖ్యాంశాలు

దిలీప్ కుమార్ ప్రతి చిత్రం మేలిమి ముత్యం .. ఆయన నటన ఎవరెస్ట్ శిఖరం

దిలీప్ కుమార్ .. .. ఈ పేరు వినగానే మనకు ఎంతో ఎత్తుగా ఉన్న శిఖరం గుర్తుకొస్తుంది. నిజమే. నటనలో ఆయన ఓ ఎవరెస్ట్ శిఖరం. ఆరు దశాబ్దాలుగా నటననే జీవితంగా పండించుకున్న బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్. 60 ఏళ్ల సుదీర్ఘ నటయాత్రలో దిలీప్ నటించింది చాలా తక్కువ చిత్రాలే. కానీ ఒక్కొక్కటీ ఓ మేలిమి ముత్యం. హిందీ చిత్ర రంగంలో ఆనాటి నటత్రయంలో ఒకరుగా భాసించిన దిలీప్ కుమార్ ఈ రోజు అనారోగ్యంతో క‌న్నుమూసారు.

మన దేశం గర్వించదగ్గ మహానటుడు దిలీప్ కుమార్. హిందీ సినిమాకు ఆయన ఓ లెజెండ్. నటన ఆయన వృత్తి కాదు , ప్రవృత్తి. ఆయన శ్వాస. ఆయన ఆశ. నటుడిగా సుదీర్ఘ జీవితం గడిపిన దిలీప్ కుమార్ దాదాపు మూడు నాలుగు తరాల నటీనటులు, నిర్మాత దర్శకులతో కలిసి పనిచేశారు. బాలీవుడ్ లో అంతకాలం పనిచేసిన నటుడు మరొకరు లేరు. సత్యజిత్ రే అంత విశిష్ట దర్శకుడు దిలీప్ కుమార్ గురించి చెబుతూ .. నటనకు పరాకాష్ట దిలీప్ .. .. అని ప్రశంసించారు.