దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని విధంగా ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు.
మంగళవారం ఉదయం జెసి పనబాకం గ్రామం, చంద్రగిరి మండలం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు జగనన్న ఆరోగ్య సురక్ష రమాదేవి, డి ఎం హెచ్ ఓ శ్రీహరి, జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయ కర్త రాజశేఖర్ రెడ్డి, జే ఎ యస్ నోడల్ అధికారిని తేజస్విని, జిల్లా టీబీ, లెప్రసి నియంత్రణ అధికారిని అరుణ సులోచన దేవి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, ఎంపీపీ హేమెంద్ర కుమార్ రెడ్డి, వైస్ ఎంపీపీ మణియాదవ్ తదితరులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ గతంలో సుమారు 45 రోజులు జగనన్న ఆరోగ్య సురక్ష మొదటి దశ ఎంతో సమర్థవంతంగా అమలు చేశామని, ప్రజల ఇంటికే వెళ్లి వారికి పరీక్షలు నిర్వహించి వారికీ చికిత్స, మందులు అందించడం, రెఫరల్ హాస్పిటల్ కు పంపి చికిత్స అందించి వారికి రోగ నిర్దారణ పరీక్షల ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి వాటికి చికిత్స ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడే కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, రెండవ దశలో అసంక్రమిత వ్యాధులు అయిన బిపి, సుగర్ వ్యాధి తదితర దీర్ఘకాలిక వ్యాధుల గుర్తింపు పరీక్షలు నిర్వహించి, మెడికల్ క్యాంపులు నిర్వహించి రెఫరల్ అవసరమైతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో చేయించి మందులు అందించి ఫాలో అప్ అండ్కించడం జరుగుతుందని, ఈ కార్యక్రమం 6 నెలల పాటు షెడ్యూల్ మేరకు నిర్వహించ బడుతుందని, ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రాష్ట్ర పరిశీలకులు మాట్లాడుతూ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నేటి జనవరి 2వ తేదీ నుండి జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ దశ ప్రారంభించడం జరిగిందని, ప్రజలు ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని, రెండో దశకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నామని, ఆరు నెలల పాటు నిరంతర ప్రాతిపదికన నిర్వహించే జగనన్న ఆరోగ్య సురక్ష – 2 కార్యక్రమం మరింత విజయవంతం చేయాలని, ఆరోగ్య శిబిరాల్లో స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించేందుకు జనరల్ మెడిసిన్, గైనకాలజిస్ట్‌లు, జనరల్ సర్జన్లు,ఆర్ధోపెడిషియన్లు, చిన్నపిల్లల డాక్టర్లు మరియు ఇతర నిపుణులు, ఇతర స్పెషలిస్టు వైద్యులు, ఎంబీబీఎస్ వైద్యులు సేవలు అందిస్తారని తెలిపారు.
డి ఎం హెచ్ ఓ మరియు జేఏఎస్ నోడల్ అధికారి మాట్లాడుతూ అన్ని ఇళ్లను సందర్శించడమే కాకుండా దీర్ఘకాలిక రోగులు, గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులు, చిన్నారుల సంరక్షణ, యుక్తవయస్కుల ఆరోగ్యం మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తుల ఆరోగ్యమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష -2 కార్యక్రమం కొనసాగనుందని వివరించారు. వాలంటీర్లు ప్రతి ఇంటికి రెండుసార్లు వెళ్లి ఆరోగ్య శిబిరాల వివరాలను ప్రజలకు వివరించనున్నారని పేర్కొన్నారు.
ప్రతి ఆరోగ్య శిబిరంలో కనీసం ముగ్గురు వైద్యులు ఉంటారని వారిలో ఇద్దరు స్పెషలిస్టు వైద్యులు మరియు ఫ్యామిలీ కాన్సెప్ట్ డాక్టర్, వారితో పాటు ఒక పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ (PMOA) ఉంటారని పేర్కొన్నారు. వాలంటీర్ల ద్వారా శిబిరాల వివరాలు ప్రజలకు తెలపడం, అవసరమైన సలహాలు, సూచనలు అందించడం, కేసుల అంశంలో ఫాలో-అప్ చేయడం జరుగుతుందని తెలిపారు. రోగులకు వారి గ్రామంలోనే వారి అవసరాలకు అనుగుణంగా మందులను అందుబాటులో ఉంచేందుకు ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్‌తో పాటు సీహెచ్‌ఓ/ఏఎన్‌ఎంలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.
అనంతరం వారు హెల్ప్ డెస్క్, కేస్ షీట్, మందులు, రక్త పరీక్షల, కంటి వెలుగు పరీక్షలు, ఆర్థో తదితర ఏర్పాట్లను పరిశీలించారు.