cruise terminal
ఆంధ్రప్రదేశ్

మార్చి నెలాఖరులోగా అందుబాటులోకి క్రూయిజ్ టెర్మినల్

విశాఖపోర్టులో సుమారు 100 కోట్ల వ్యయంతో నిర్మించిన క్రూయిజ్‌ టెర్మినల్‌ను ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా ఆపరేషన్‌లోకి తీసుకువస్తామని పోర్టు చైర్మన్‌ ఎం.అంగముత్తు తెలిపారు.క్రూయిజ్‌ షిప్‌లను నడిపే సంస్థలు మూడేళ్లు ముందుగా ప్లాన్‌ రూపొందించుకొని వారి రూట్లను ఖరారు చేసుకుంటాయని, అందువల్ల వెంటనే క్రూయిజ్‌లను రప్పించడానికి వీలు కాలేదన్నారు. విశాఖపట్నం నుంచి అండమాన్‌ వరకు, అక్కడి నుంచి దక్షిణ ఆసియా దేశాలైన థాయ్‌ల్యాండ్‌, మలేషియా, సింగపూర్‌లకు క్రూయిజ్‌ షిప్‌లను నడిపే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. చెన్నై, పూరీ, కోల్‌కతాలను కలుపుతూ ఒక టూరిస్ట్‌ సర్క్యూట్‌ ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. విశాఖపట్నాన్ని ప్రపంచ పర్యాటక చిత్రపటంలో ఉంచాలనేదే తమ ధ్యేయమన్నారు. చెన్నై-విశాఖపట్నం-కొలంబోకు ఒక క్రూయిజ్‌ నడపనున్నామని చెప్పారు.