addanki-bandi
తెలంగాణ రాజకీయం

అద్దంకి, బండి లలో ఎవరికి

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం  షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగాఉన్న కడియం శ్రీహరి  స్టేషన్ఘన్పూర్ నుంచి, పాడి కౌశిక్ రెడ్డిహుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వాళ్లు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో ఆ సీట్లు ఖాళీ అయ్యాయి. వారిద్దరి పదవీకాలం 2027 నవంబర్30 వరకు ఉండటంతో ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ నెల 11న నోటిఫికేషన్ జారీ చేయనుంది. 18 వరకు నామినేషన్లకు గడువు ఉంటుంది. 19న స్క్రూటినీ చేస్తారు. 22 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. 29న పోలింగ్నిర్వహించి .. అదే రోజు 5 గంటల నుంచి ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీలో  ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం రెండు స్థానాలల్లో పార్టీల బలాబలాలను బట్టి.. రెండు ఎమ్మెల్సీల్లో ఒకటి అధికార కాంగ్రెస్ కు దక్కే అవకాశం ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీలు పొందిన వారు, ఎన్నికల్లో పరాజితులైన వారు, సీనియర్‌ నాయకులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లో ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది.
రేసులో అద్దంకి దయాకర్..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అవకాశం కల్పించాలని హైకమాండ్ ను టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు మహేష్‌ కుమార్‌గౌడ్‌, జగ్గారెడ్డి, సీనియర్‌ నేత హర్కారే వేణుగోపాల్‌ కోరుతున్నట్లు సమాచారం. మైనారిటీ వర్గానికి ప్రాతినిథ్యం కల్పించాలని అధిష్ఠానం నుంచి సంకేతాలు ఉన్నందున తమ పేర్లు పరిశీలించాలని షబ్బీర్‌ అలీ, అజారుద్దీన్‌, ఫెరోజ్‌ఖాన్‌ కోరుతున్నట్లు తెలిసింది. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసిన మైనారిటీ వర్గం నేతలు షబ్బీర్‌ పీర్‌ అహ్మద్‌, అలీ మస్కతీ పేర్లు సైతం వినిపిస్తున్నాయి. వీరితోపాటు సీఎం రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) సన్నిహితుడైన వేం నరేందర్‌రెడ్డి, అద్దంకి దయాకర్‌, బండ్ల గణేష్‌ తదితరులు తమకు అవకాశం కల్పించాలని ఇప్పటికే అధిష్ఠానానికి అభ్యర్థనలు పంపినట్టుసమాచారం.