సామాజిక సాధికారతకు పెద్దపీట వేస్తూ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహిళలు, యువత, కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టి, బిసి, మైనారిటీలకు తగిన ప్రాధాన్యమిస్తున్నారు. ఏపీలో పొలిటికల్ హిట్ నెలకొంది. ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. అవకాశాలు దక్కని వారు ప్రత్యామ్నాయల కోసం వెతుక్కుంటున్నారు. పార్టీల నుంచి వీడడం, వేరే పార్టీలో చేరడం శరవేగంగా జరిగిపోతున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో 38 మంది అభ్యర్థులను ఆ పార్టీ మార్చింది. ఇప్పుడు తుది జాబితాకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి కసరత్తు పూర్తయింది. ఈ సాయంత్రానికి జాబితా వెలువడే అవకాశం ఉంది. సామాజిక సాధికారతకు పెద్దపీట వేస్తూ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహిళలు, యువత, కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టి, బిసి, మైనారిటీలకు తగిన ప్రాధాన్యమిస్తున్నారు. మలి జాబితాలో అన్ని కులాల వారి ప్రాతినిధ్యం ఉండేలా చూసుకున్నట్లు తెలుస్తోంది. మూడో విడత జాబితా పై దాదాపు కసరత్తు పూర్తయినట్లు సమాచారం.
కొద్దిపాటి చేర్పులు మార్పులు చేస్తూ వైసీపీ అగ్రనాయకత్వం 25 మంది పేర్లతో ఈ జాబితాను వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రధానంగా అనంతపురం, సత్య సాయి పుట్టపర్తి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాపు రామచంద్రారెడ్డికి ఈసారి టిక్కెట్ దక్కదన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన సమాచారం అందుకొని పార్టీకి రాజీనామా కూడా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ మూడో జాబితాలో రాయదుర్గం ఇన్చార్జి పేరును ప్రకటించే అవకాశం ఉంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం లో కూడా మార్పులు ఉన్నట్లు సమాచారం. అక్కడ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అగ్రనాయకత్వం ఆయనకు టిక్కెట్ ఇవ్వడం లేదన్న సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
కనీసం కర్నూలు లోక్ సభ స్థానానికైనా తన పేరును పరిశీలించాలని జయరాం కోరుతున్నట్లు సమాచారం. ఒకవేళ వైసీపీ నాయకత్వం మొండి చేయి చూపితే గుమ్మనూరు జయరాం పార్టీ నుంచి బయటికి వెళ్లే అవకాశం ఉంది. షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే వైసీపీ మూడో విడత జాబితా పెను ప్రకంపనలకు దారి తీసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది