ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

హత్య కేసులో నిందితుల అరెస్టు

చీరాల: బాపట్ల జిల్లా చీరాల మండలం ఆదినారాయణపురం వద్ద ఈ నెల ఆరోవ తేదిన జరిగిన సయ్యద్ అమీన్ ఆరీఫ్ అనే యువకుడి హత్య కేసును పోలీసులు చేధించారు.ఎనిమిది మంది నిందితులు  ఈ నేరానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.. వీరిలో  ప్రధాన నిందితుడు రౌడి షీటర్ సందీప్ తో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకోగా పారారిలో ఉన్న మహేంద్ర, వంశీల అనే మరో ఇద్దరు నిందితులు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లుగా అడిషనల్ ఎస్పి విఠలేశ్వరరావు మీడియాకు తెలిపారు. స్నేహితుడు మనోజ్ తో కలిసి ఆరీఫ్ చీరాల నుండి ఈపూరుపాలెం వెళ్ళుతుండగా ఆదినారాయణపురం వద్ద  అదే మార్గంలో  కారులో వెళ్ళుతున్న నిందితులకు సైకిల్ పై వెళ్ళుతున్న ఆరీఫ్ బైక్ పై వెళ్ళుతున్న మనోజ్ లు సైడ్ ఇవ్వలేదనే కారణంతో కారులోని ఎనిమిది మంది నిందితులు మనోజ్ పై దాడి చేసి ఆరీఫ్ పై కోడి కత్తులతో విచక్షణా రహితంగా దాడిచేసి హత్యకు పాల్పడ్డారని..ఈ నేరాన్ని ముద్దాయిలు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసులో నిందితుల పై గతంలో పలు స్టేషన్ లలో రౌడి షీట్స్ తో పాటు పలు కేసులు ఉన్నట్లు ఏఎస్పీ విశ్వేశ్వరరావు తెలిపారు.