tdp-janasena
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

టీడీపీ, జనసేన నేతల విబేధాలు

ప్రకాశం జిల్లా గిద్దలూరులో టీడీపీ వైసీపీ మధ్య పచ్చగడ్డి వస్తే భగ్గుమంటుంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకుంటూ  విబేధాలను తారా స్ధాయికి తీసుకెల్తున్నారు. ఒకపక్క అధినేతలు ఇద్దరు కలిసి 2024లో అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు పన్నుతుంటే…. గిద్దలూరులో మాత్రం ఇరు పార్టీల ఇంఛార్జీలు నువ్వా నేనా అంటూ మాటల యుద్దం కొనసాగిస్తున్నారు. ఇక్కడ టీడీపీ ఇంచార్జీగా మాజీ ఎమ్మెల్యే ముత్తుముళ్ల అశోక్ రెడ్డి ఉన్నారు. ఈయన గత ఎన్నికల్లో గిద్దలూరు నుండి టీడీపీ తరుపున పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి చేతిలో భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక జేఎస్పీ ఇంఛార్జీ బెల్లంకొండ సాయిబాబు గత ఎన్నికల్లో  ఒంగోలు పార్లమెంట్ కు జనసేన అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం ఈయనను గిద్దలూరు జనసేన పార్టీ ఇంఛార్జీగా అధినేత పవన్ కళ్యాన్ నియమించారు. టీడీపీ, జేఎస్పీల మధ్య పొత్తు లేనంత వరకు ఈ ఇద్దరు ఇంఛార్జీలు ఎవరి పని వారు చేసుకుంటూ పోయారు.

అయితే ఇటీవల ఇరుపార్టీల అధినేతలు రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించడంతో  గిద్దలూరు లోని టీడీపీ, జనసేనలో విబేధాలు బయటపడుతున్నాయ్. ప్రకాశం జిల్లాలో జనసేన బలంగా ఉన్న నియోజికవర్గాల్లో గిద్దలూరు కూడా ఒకటి. అదే ఇప్పుడు అశోక్ రెడ్డి, సాయిబాబు మద్య విభేదాలకు కారణంగా కనిపిస్తుంది. పొత్తులో భాగంగా జిల్లాలో దర్శి, గిద్దలూరు సీట్లు జేఎస్పీకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో అలెర్ట్ అయిన అశోక్ బాబు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుండి తనే బరిలో ఉంటారని తన వర్గం నేతలతో ప్రచారం చేసుకుంటున్నారట.
 జేఎస్పీ ఇంఛార్జీ సాయిబాబు రంగంలోకి దిగి అశోక్ రెడ్డి పై విమర్శలు ఎక్కు పెట్టారు. బాలాజీ, అశోక్ రెడ్డిల వైఖరిను ఖండించారు. అశోక్ రెడ్డి కావాలని జనసేన నేతలను దూరం పెడుతున్నారని మండపడ్డ సాయిబాబు జనసేన సొంతగా కార్యక్రమాలు నిర్వహించుకుంటుందని తేల్చేసారు. మరోవైపు టిక్కెట్ కన్ ఫర్మ్ కాకున్నా అశోక్ రెడ్డి వర్గం చేస్తున్న ప్రచారం పై జేఎస్పీ నేతలు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రస్తుతం గిద్దలూరు టిక్కెట్ కోసం టీడీపీ నుండి అశోక్ రెడ్డి పావులు కదుపుతుండగా జనసేన నుండి సాయిబాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరడు ఆమంచి స్వాములు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమచారం.