chandra-HC
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

చంద్రబాబు నాయుడు కు ఏపీ హైకోర్టు లో భారీ ఊరట

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ఏపీ హైకోర్టు లో భారీ ఊరట లభించింది. బుధవారం నాడు హైకోర్టులో చంద్రబాబుపై ఉన్న మూడు కేసులపై విచారణ జరిగింది. ఈ విచారణలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఐఆర్ఆర్,  మద్యం, ఉచిత ఇసుక కేసులల్లో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ నరేష్‌కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిల్స్ సిద్ధార్థ లూథ్ర.. దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు.