sharmila-chandra
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

కొడుకు పెళ్లికి చంద్రబాబును ఆహ్వానించిన షర్మిలా

వైఎస్సార్ మనవడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి చంద్రబాబును ఆహ్వానించాం.  పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని కోరానని కాంగ్రెస్ నేత షర్మిల అన్నారు. వైఎస్సార్ తో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి చాలా సేపు చర్చ జరిగింది.  వైఎస్సార్ గురించి చాలా గొప్పగా చెప్పారు.   రాజకీయ జీవితంలో వైఎస్సార్ తో ఉన్న అనుభవాలు అన్ని పంచుకున్నారు.   కాంగ్రెస్ పార్టీ ఏ భాద్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తామని అన్నారు.
రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలి.   రాహుల్ ప్రధాని అయితేనే ఈ దేశం బాగుపడుతుంది.   రాహుల్ ను ప్రధాని చేయడమే వైఎస్సార్ లక్ష్యం.   నాకు భాద్యతలు ఇచ్చిన అంశం బట్టి చేరికల మీద తర్వాత చెప్తామని అన్నారు.
చంద్రబాబు ను కలవడం రాజకీయం చేయాల్సిన అవసరం లేదు.  నేను గతంలో క్రిస్మస్ కేకు పంపితే తప్పు పట్టారు.   నేను చంద్రబాబు కే కాదు అందరికీ పంపాం.  ఇక్కడ కేటీఆర్, హరీష్,కవిత కుడా పంపానని అన్నారు. రాజకీయాలు అన్నది జీవితాలు కాదు.   రాజకీయాలు ప్రజల కోసం చేస్తున్న సర్వీస్. రాజకీయాలు అనేది మా ప్రొఫెషన్.   ఈ క్రమంలో ఒకరిని ఒకరు మాటలు అనుకుంటాం.  కేవలం రాజకీయ ప్రత్యర్ధులం మాత్రమే.   అందరం ప్రజల కోసమే పని చేయాలి.  పండుగకో,లేదా పెళ్లికి కేకు లాంటివి పంపిస్తే తప్పు పట్టాల్సిన అవసరం లేదు.  ఇప్పుడు చంద్రబాబును కేవలం పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చామని అన్నారు.
చంద్రబాబు ఒక పార్టీకి అధ్యక్షుడు.  నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త.    మాకు రాజకీయంగా ఎటువంటి లావాదేవీలు లేవు.   వైఎస్సార్ తన బిడ్డల పెళ్లికి చంద్రబాబు ను పిలిచారు.  మా పెళ్లిళ్లకు చంద్రబాబు వచ్చి వచ్చారు..దీవించారని అన్నారు.