ఏపీ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల కొత్త అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. ఏపీలో ఆయన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి సొంత పార్టీ వైఎస్ఆర్‌సీపీ ద్వారా ముఖ్యమంత్రిగా ఉన్నారు. పార్టీ కోసం షర్మిల పాదయాత్ర సహా చాలా కష్టపడ్డారు. అయితే కారణాలేంటో తెలియదు కానీ చెల్లి షర్మిలను జగన్ దూరం పెట్టడంతో ఆమె తన రాజకీయ లక్ష్యాలను అందుకోవడానికి తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. కానీ అక్కడి రాజకీయ పరిస్థితుల్ని చూసిన తర్వాత మనసు మార్చుకుని ఏపీకి వచ్చేశారు. తండ్రి వైఎస్ జీవితాంతం ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులయ్యారు. అంటే అన్నతో చెల్లి పోటీ పడబోతున్నారు. మరి వీరిద్దరిలో తల్లి విజయలక్ష్మి మద్దతు ఎవరికి ఉండబోతోంది ?షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు విజయమ్మ పూర్తి మద్దతుగా నిలిచారు. పిల్లలిద్దరూ చెరో రాష్ట్రంలో రాజకీయం చేయాలని దేవుడు రాసి పెట్టారని చెప్పుకున్నారు. తెలంగాణలో వైఎస్ఆర్‌సీపీ పోటీ చేయడం లేదు కాబట్టి అన్నా చెల్లెళ్ల మధ్య సవాల్ జరిగే అవకాశం కనిపించ లేదు.అందుకే విజయమ్మకు కూడా ఇద్దరి మధ్య ఎవరో తేల్చుకోవాల్సిన అవసరం రాలేదు.
కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. షర్మిల తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేశారు. షర్మిల నేరుగా తన అన్నతో ఢీకొనడానికి ఇష్టం లేకే తెలంగాణలో పార్టీ పెట్టారని గతంలో ప్రచారం జరిగిదంి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీలో తాను స్థాపించిన పార్టీని విలీనం చేసేసి ఏపీలో తన అన్నను గట్టిగా ఢీకొనాలనే ధృఢ సంకల్పంతో షర్మిల రెడీ అయ్యారు. రాజకీయాల్లోకి వచ్చాక బలమున్న చోటే వెదుక్కోవాలి. లేకపోతే కష్టం. ఈ సూత్రం తెలియకుండా షర్మిలరాజకీయం చేయరని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఆమె ప్రభావం దాదాపుగా లేదని ఇక ఏటూ తేల్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి మొహమాటాలు వదిలేయాలని అనుకున్నారని చెబుతున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల వంద శాతం పార్టీ కోసం పని చేసే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో పిల్లల్లో విజయమ్మ సపోర్ట్ ఎవరికి అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు విజయమ్మ కూతురు వైపే మొగ్గు చూపారు. కూతురుకు అండగా నిలవడమే ప్రాధాన్యతాంశంగా తీసుకున్నారు.
వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా రాజీనామా చేసినప్పుడు అదే చెప్పారు. ఇద్దరు బిడ్డలు రెండు రాష్ట్రాల్లో రాజకీయం చేస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు ఒకరిపైకి ఒకరు రాజకీయం చేసే పరిస్థితులు వచ్చాయి. షర్మిల ఏపీకి వచ్చేయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత షర్మిలను కట్టడి చేయాలని విజయమ్మపై జగన్ ఒత్తిడి తెచ్చారన్న ప్రచారం జరిగింది. తన ఇద్దరు పిల్లలు తనకు రెండు కళ్లని విజయమ్మ చెబుతూ వస్తున్నారు. అప్పుడు ఆమె రెండు కళ్లల్లో ఏదోక కంటికే ప్రాధాన్యం ఇవ్వక తప్పదన్న వాదన వినిపిస్తోంది. షర్మిళ వైపే విజయమ్మ నిలబడితే జగనుకు నైతికంగా భారీ దెబ్బ తగిలినట్టే భావిస్తారు. ఇప్పటికే తల్లి.. చెల్లెలను పట్టించుకోవడం లేదనే విమర్శలను జగన్ ఎదుర్కొంటున్నారు. ఇక షర్మిళ నేరుగా ఏపీ రాజకీయ రంగంలోకి దూకారు కాబట్టి నేరుగా జగన్ను విమర్శించే పరిస్థితి వస్తుందిమద్దతు ఇవ్వకుండా విజయమ్మ తటస్థంగా ఉంటారని వైసీపీ వర్గాలు నమ్ముతున్నాయి. కానీ ప్రస్తుతం విజయమ్మ షర్మిల వద్దే ఉంటున్నారు. రెండు, మూడు సార్లు షర్మిలతో కనిపిస్తే.. కుమార్తెకే ఆమె మద్దతు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇది సీఎం జగన్‌కు ఇబ్బందే