తెలంగాణ ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఉన్నత అధికారుల నుంచి వేర్వేరు స్థాయిల్లో పని చేస్తున్న ఉద్యోగులకు టెన్షన్ పట్టుకుంది. అందుకు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కారణం. వారంతా ప్రభుత్వ కొలువులో రిటైర్డ్ అయి తిరిగి పదవుల్లో కొనసాగుతున్న వారు. రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్లలో ఇప్పటికీ పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల వివరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో రీఅపాయింట్ అయి ఇంకా కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్నవారి లెక్కలు తీయడం మొదలు పెట్టింది. ఇందుకోసం అన్ని డిపార్ట్మెంట్లు, విభాగాలు, కార్పొరేషన్లు, ఏజెన్సీలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జారీ చేసిన సర్క్యులర్ లో పేర్కొన్నారు. ఇందుకు అవస రమైన నిర్దిష్ట ఫార్మాటు కూడా జతచేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన రీ- అపాయింట్ వివరాలను కూడా సమర్పించాలని సూచించారు.
గత ప్రభుత్వంలో చాలా డిపార్ట్మెంట్లలో రిటైర్డ్ ఉద్యోగులు రీఅపాయింట్ మెంట్ కొనసాగుతు న్నారని ఎన్నికల ప్రచారం సమయంలో కాంగ్రెస్ ఆరోపించింది. ఇలాంటివారందరినీ అధికారంలోకి వచ్చిన తర్వాత విధుల నుంచి తొలగిస్తామని చెప్పింది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఒక టిన్నర నెల రోజులు అవుతున్న సందర్భంగా వివరాలు సేకరించడంపై దృష్టి పెట్టింది. త్వరలో వీరి ఏరివేత కోసమే ఈ వివరాలను ప్రభుత్వం తెప్పించుకుంటున్నదనే చర్చ సచివాల యంలో మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయిన తర్వాత కూడా రీఅపాయింట్మెంట్ అయిన సిబ్బందికి సంబంధించిన పలు వివరాలను నిర్దిష్ట ఫార్మాట్లో తెప్పించుకుంటున్నది. ఆ ప్రకారం పదవీ విరమణ పొందినా ఇంకా సర్వీసులో ఏదో ఒక పేరుతో కొనసాగుతున్నవారిని గుర్తించే ప్రాసెస్ ను మొదలుపెట్టింది.
1. సదరు ఉద్యోగి రిటైర్ అయింది. ఎప్పుడు? వారి పేరు
2.రిటైర్ అయ్యే నాటికి వారి హోదా ఏంటి?
3.ఇప్పుడు ఏ శాఖలో కొనసాగుతున్నారు?
4. రీ అపాయింట్ అయింది ఎప్పుడు?
5.వారు ఏ హోదాలో కొనసాగుతున్నారు?
6.ఇంకా ఎంత కాలం కొనసాగేలా ఉత్తర్వుల్లో మెన్షన్ అయింది?
7.ఇతర వివరాలేమైనా ఉంటే తెలియజేయవచ్చు