ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

సీఎం జ‌గ‌న్‌కు ఎంపీ ర‌ఘురామ‌ మ‌రో లేఖ

ఏపీబీసీఎల్ సిబ్బంది.. రెడ్డి ఎంట‌ర్‌ప్రైజెస్ వ‌సూళ్లపై లేఖ‌

ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు సీఎం జగన్ కు ఈ రోజు మ‌రో లేఖ రాశారు. ఇందులో ఏపీబీసీఎల్ సిబ్బంది, రెడ్డి ఎంట‌ర్‌ప్రైజెస్ వ‌సూళ్ల విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. మ‌ద్యం దుకాణాల నుంచి 5 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌కు రెడ్డి ఎంట‌ర్‌ప్రైజెస్ ప్లాన్ చేసింద‌ని ఆయ‌న ఆరోపించారు.

19,258 మంది ఉద్యోగుల‌కు నెల జీతం చెల్లించాలంటూ రెడ్డి ఎంట‌ర్‌ప్రైజెస్ వారు మ‌ద్యం షాపుల నుంచి ఈ మొత్తాన్ని డిమాండ్ చేశార‌ని ఆయ‌న అన్నారు. మ‌రోవైపు, రెడ్డి ఎంటర్ ప్రైజెస్ 19.25 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌కు మ‌రోప్లాన్ కూడా వేసింద‌ని చెప్పారు. దీనిపై డిప్యూటీ సీఎంకి ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ విచార‌ణ జ‌ర‌గ‌లేద‌ని అన్నారు. వెంట‌నే దీనిపై విచార‌ణ జ‌రిపించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.