roja
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

నగరిలో రోజా దారెటు

ఏపీలోని సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం. టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో రెండు సార్లు రోజా గెలిచారు. మరి ఈ సారి గెలుస్తారా అంటే అసలు టిక్కెట్ ఇస్తారా అన్న చర్చ ఎక్కువ జరుగుతోంది. గత రెండు సార్లు ఆమె గెలవడానికి తమిళ ఓటర్లు కీలకం. ఇటీవల రజనీకాంత్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఈ సారి వారినీ దూరం చేసుకున్నారు రోజా. ఇక సొంత నేతల సంగతి చెప్పాల్సిన పని లేదు. నియోజకవర్గంలో ఎవరితోనూ సఖ్యత ఉండని ఒకే ఒక్క నేత రోజా మంత్రి కావాలంటే ముందుగా ఎమ్మెల్యే కావాలి. ఎమ్మెల్యే అవ్వాలంటే నియోజకవర్గంలో పార్టీ నేతలందరితో సఖ్యతగా ఉండాలి. కానీ రోజా స్టైల్ వేరు. నగరి నియోజకవర్గంలో ఒక్క మండలం నేతతో కూడా ఆమె సఖ్యతగా ఉండరు. నగరి నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. ఐదు మండలాలకు చెందిన ముఖ్య నేతలు ఆమెకు వ్యతిరేకమే. ఈ ఐదుమండలాల నేతల్లో ఇద్దరు రాష్ట్ర స్థాయి పదవులు ఉన్న వారున్నారు. మిగిలిన వారు వారి వారి స్థాయిల్లో మండలాల్లో పట్టు ఉన్న వారు ఉన్నారు.

జడ్పీటీసీలు లాంటి కీలక పదవుల్లో ఉన్న వారితోనూ ఇబ్బందులే. రోజాకు వ్యతిరేకంగా పెద్దిరెడ్డి రాజకీయం ఎమ్మెల్యేపై ఇంత తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేతలు ఉన్నారంటే వారికి బలమైన సపోర్టు ఉన్నట్లే లెక్క. రోజా వ్యతిరేక వర్గానికి పెద్దిరెడ్డి సపోర్టు ఉంది. నగరిలో రోజాకు చెక్ పెట్టేందుకు మంత్రి పెద్దిరెడ్డి సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారని కొంత కాలంగా అభిప్రాయం ఉంది. రోజాకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారికి పెద్దిరెడ్డి సపోర్ట్ ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తం తన గుప్పిట్లో ఉండాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకుంచారు. కానీ రోజా ఆయనకు వ్యతిరేక వర్గంగా మారిపోయారు.  గత రెండు సార్లు అందరూ కృషి చేసినా స్వల్ప తేడాతోనే రెండు సార్లు విజయం సాధించారు. నగరిలో తమిళ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. రోజా భర్త సెల్వమణి తమిళుడు. ఈ తమిళ నేపధ్యం ఉపయోగపడింది. ఇటీవల రజనీకాంత్ పై ఆమె చేసిన వ్యాఖ్యలతో ఆ వర్గంలోనూ వ్యతిరేకత పెంచుకున్నారు. గతంలోనే ఐదు మండలాల నేతలు సమావేశం పెట్టి.. ఇక మరోసారి రోజాకు చాన్సిస్తే గెలిపించే చాన్సే లేదని తీర్మానించుకున్నారు.

రోజాకు టిక్కెట్ నిరాకరించే ఉద్దేశంతోనే ఇలా వారిని ఎగదోస్తున్నారని రోజా వర్గీయుల్లో అనుమానాలు కూడా ఉన్నాయి. రోజా చేసే రచ్చ భయంతోనే టిక్కెట్ ఇచ్చే చాన్స్ రోజా.. జగన్ మోహన్ రెడ్డిపై నమ్మకంతో .. టీడీపీ వాళ్లను ఇష్టారీతిన తిట్టింది. పవన్ నూ వదల్లేదు. ఆమెకు వైసీపీ తప్ప మరో రాజకీయ వేదిక లేదు. ఉండదు కూడా. అలా అన్ని ఆప్షన్లను వదులుకుని ఉంటే.. ఇప్పుడు టిక్కెట్ నిరాకరిస్తారా అని ఆమె రెచ్చిపోతే… జగన్ రెడ్డి, సజ్జల రెడ్డి తట్టుకోలేరన్నది ఎక్కువ మంది భావన. అయితే చివరికి వేరే వారికి టిక్కెట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.