alphores
తెలంగాణ రాజకీయం

అంతర్జాతీయ ఇంగ్లీష్ ఒలంపియాడ్లో అల్ఫోర్స్

ఆంగ్ల భాషకు ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపున్నదని, పలు పోటి పరీక్షల విజయాలలో కీలకంగా వ్యవహరిస్తుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో విద్యార్థులు అంతర్జాతీయ ఇంగ్లీష్ ఒలంపియాడ్ లో ప్రశంసనీయమైన ఫలితాలు సాధించిడం పట్ల ఏర్పాటు చేసినటువంటి విద్యార్థుల అభినందన సభకు ముఖ్యఅతిధిగా  ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నేడు ప్రతి విద్యార్థి ఆంగ్ల సంబంధిత పోటీ పరీక్షల గురించి తెలుసుకోవల్సిన అవసరం ఎంతగానో ఉన్నదని, వారికి కావల్సిన అంశాలను  విషయాలను సమగ్రంగా తెలియచేయాలని, ఉత్తమంగా తీర్చిదిద్దాలని చెప్పారు. పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు ఆంగ్లంలో మక్కువ కలిగేలా ప్రోత్సాహకాలను అందించి వివిధ స్థాయిల్లో రాణించే విధంగా ప్రోత్సహాం అందించాలని వారు చెప్పారు.
ఆంగ్లం ద్వారా విదేశాలలో ఉపాధి అవకాశాలను సునాయసంగా ఉపయోగించవచ్చని మరియు పలు సంస్థల్లో చాలా సులభంగా నిర్వర్తించగలుగుతామని తెలిపారు. ఆంగ్ల భాషకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండడం వలన ఉపాధి అవకాశాలు అత్యధికంగా ఉండడమే కాకుండా పెద్ద మొత్తం జీతాలతో ఉత్తమమైన జీవితాన్ని కొనసాగించవచ్చని గుర్తు చేశారు.
ఈ క్రమంలో ఇటీవల కాలంలో ప్రముఖ పోటీ పరీక్షల సంస్థ అయిన యన్.ఓ.యఫ్ వారు నిర్వహింపబడిన అంతర్జాతీయ స్థాయి ఇంగ్లీష్ ఒలంపియాడ్లో పాఠశాలకు చెందినటువంటి పి.గౌరి, 3వ తరగతి, సి. హెచ్.ప్రగ్జ సాయి, కె. కీర్తన, యన్. వైశ్వంత్ చక్రి, 4వ తరగతి, లిఖిత్ మానిక్యరావ్, కె. సుచిత్ రెడ్డి, 5వ తరగతి, ఇ. లిఖిత్ కుమాల్, . ఇ. సుహాన్, పి. గోమిక, 6వ తరగతిలు తదితర విద్యార్థులు గోల్డెమెడల్స్ ఆఫ్ ఎక్స్టెన్స్ మరియు ప్రశంసా పత్రాలను గెలుచుకున్నారని హర్షం వ్యక్తం చేస్తూ భవిష్యత్లో మరిన్ని విజయాలను నమోదుచేయాలని ఆకాంక్షించారు.
విజేతలకు పుష్పగుచ్చాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.