land mafia-karim ngr
తెలంగాణ ముఖ్యాంశాలు

కరీంనగర్ లో బయటకు వస్తున్న భూ దందాలు

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో భూ దందాలకు సంబంధించిన వ్యవహారంలో ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఆరంభం కావడంతో బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయించడం మొదలైంది. ప్రభుత్వ భూములుతోపాటు ప్రయివేట్ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతుంది. కరీంనగర్‌కు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్పోరేటర్ తోట రాములు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుచరుడిగా చెప్పుకుంటున్న చీటి రామారావులను అరెస్ట్ చేసిన తరువాత భరోసాతో ఠాణా మెట్లెక్కేవారి సంఖ్య పెరిగిపోతోంది. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్లూ) పేరిట ప్రత్యేకంగా ఓ టీమ్ కూడా ఏర్పాటు చేశారు.

బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కో కేసును దర్యాప్తు చేసే పనిలో నిమగ్నం అయింది కరీంనగర్ పోలీసు యంత్రాంగం. రెండు రోజుల క్రితం అరెస్టుల పరంపర మొదలు కావడంతో బాధితులకు కమిషనర్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. గురు, శుక్రవారాల్లో పెద్ద సంఖ్యలో బాధితులు తమ గోడు చెప్పుకునేందుకు సీపీ అభిషేక్ మహంతిని కలిశారు. బాధితులు చెప్పిన వివరాలను విన్న సీపీ సంబంధిత పోలీసు స్టేషన్లకు విచారణకు ఆదేశిస్తున్నారు.కరీంనగర్ సమీపంలో ఉన్న బొమ్మకల్ లో ప్రభుత్వ భూములు బడా భూములు ఆక్రమించారు. చాలా ఏళ్లుగా పలువురు పోరాటం చేస్తున్నారు. అయినా అధికారుల నుంచి స్పందన రావడం లేదు.

దీంతో మరో సారి.. బొమ్మకల్ సర్పంచ్, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పురుమళ్ల శ్రీనివాస్ పై బాధితులు కరీంనగర్ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ పదవి అడ్డు పెట్టుకుని నకిలీ పత్రాలు సృష్టించాడని బాధితులు ఆరోపించారు. 30 మందికి పైగా బాధితులము పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశామని, రెవెన్యూ రికార్డులు కూడా తారుమారు చేశాడని బాధితులు పురుమళ్ల శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ తో పాటు అతని అనుచరుల వల్ల తమకు ప్రాణహాని ఉందన్న బాధితులు గతంలో అతనిపై పీడీ యాక్టు పెట్టలేదని వివరించారు. కేవలం శ్రీనివాస్ కాదు చాలా మంది వీటి పై కన్ను వేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నెంబర్ తో రిజిస్టర్ చేయించుకున్నారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రభుత్వ భూమి ఆక్రమించారాని గతంలో పిర్యాదు చేశారు. అదేవిధంగా రేకుర్తి, బ్యాంకు కాలనీలో పలువురు భూములు ఆక్రమించారు. తీగలాగుంటపల్లిలో కూడా ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. డబుల్ రిజిస్టర్ చేసిన కేసులు అధికంగా ఉన్నాయి. ఎక్కవగా బీఆర్‌ఎస్‌ నేతలపై పిర్యాదులు వస్తున్నాయి.

అక్రమాల వ్యవహారంలో పంజా విసురుతున్న కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి ఫిర్యాదుల రాగానే కేసులు నమోదు చేసే విధానానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు, ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత క్షేత్ర స్థాయిలో విచారణ జరిపేందుకు కూడా ప్రత్యేకండా టీమ్స్ ను ఏర్పాటు చేశారు. ఫీల్డ్ విజిట్ చేసిన తరువాత, బాధితులతో పాటు సాక్షుల నుండి వివరాలు సేకరించి వివిధ సెక్షన్లలో కేసులు నమోదు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. భూ దందాలకు పాల్పడిన నిందితులకు శిక్షలు ఖచ్చితంగా పడాలన్న లక్ష్యంతో పకడ్భందీగా కేసులు నమోదు చేస్తున్నారు. దీనివల్ల అక్రమాలు చేసేందుకు సాహసించే పరిస్థితి భవిష్యత్తులో కూడా రాకూడదని సీపీ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారి భరతం పడితే తప్ప అక్రమ వ్యవహారాలకు పుల్ స్టాప్ పడే అవకాశం లేదని గుర్తించే అభిషేక్ మహంతి కఠినంగా వ్యవహరిస్తున్నారు. తన భూమి అక్రమణ చేసేందుకు.. బీఆర్ఎస్‌ నేతలు ప్రయత్నం చేశారని బాధితుడు రాజురెడ్డి అంటున్నారు.

కరీంనగర్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్పోరేటర్ తోట రాములు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుచరుడిగా చెప్పుకున్న చీటి రామారావులను అరెస్ట్ చేసిన తరువాత భరోసాతో ఠాణా మెట్లెక్కేవారి సంఖ్య పెరిగిపోతోంది. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్లూ) పేరిట ప్రత్యేకంగా ఓ టీమ్ కూడా ఏర్పాటు చేశారు. బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కో కేసును దర్యాప్తు చేసే పనిలో నిమగ్నం అయింది కరీంనగర్ పోలీసు యంత్రాంగం. రెండు రోజుల క్రితం అరెస్టుల పరంపర మొదలు కావడంతో బాధితులకు కమిషనర్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. గురు, శుక్రవారాల్లో పెద్ద సంఖ్యలో బాధితులు తమ గోడు చెప్పుకునేందుకు సీపీ అభిషేక్ మహంతిని కలిశారు. బాధితులు చెప్పిన వివరాలను విన్న సీపీ సంబంధిత పోలీసు స్టేషన్లకు విచారణకు ఆదేశిస్తున్నారు.బొమ్మకల్ సర్పంచ్, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పురుమళ్ల శ్రీనివాస్ పై బాధితులు కరీంనగర్ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.

సర్పంచ్ పదవి అడ్డు పెట్టుకుని నకిలీ పత్రాలు సృష్టించాడని బాధితులు ఆరోపించారు. 30 మందికి పైగా బాధితులము పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశామని, రెవెన్యూ రికార్డులు కూడా తారుమారు చేశాడని బాధితులు పురుమళ్ల శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ తో పాటు అతని అనుచరుల వల్ల తమకు ప్రాణహాని ఉందన్న బాధితులు గతంలో అతనిపై పీడీ యాక్టు పెట్టలేదని వివరించారు.అక్రమాల వ్యవహారంలో పంజా విసురుతున్న కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి ఫిర్యాదుల రాగానే కేసులు నమోదు చేసే విధానానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు, ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత క్షేత్ర స్థాయిలో విచారణ జరిపేందుకు కూడా ప్రత్యేకండా టీమ్స్ ను ఏర్పాటు చేశారు. ఫీల్డ్ విజిట్ చేసిన తరువాత, బాధితులతో పాటు సాక్షుల నుండి వివరాలు సేకరించి వివిధ సెక్షన్లలో కేసులు నమోదు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

భూ దందాలకు పాల్పడిన నిందితులకు శిక్షలు ఖచ్చితంగా పడాలన్న లక్ష్యంతో పకడ్భందీగా కేసులు నమోదు చేస్తున్నారు. దీనివల్ల అక్రమాలు చేసేందుకు సాహసించే పరిస్థితి భవిష్యత్తులో కూడా రాకూడదని సీపీ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారి భరతం పడితే తప్ప అక్రమ వ్యవహారాలకు పుల్ స్టాప్ పడే అవకాశం లేదని గుర్తించే అభిషేక్ మహంతి కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం అయిందని అంటున్నారు. వేయిల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని స్థానికులు చెబుతున్నారు. 200 ఎకరాల వరకు ఆక్రమించారని అంటున్నారు. భూ అక్రమణ కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు.