సోమవారం తిరుపతిలో మీడియాతో మంత్రి రోజా మాట్లాడుతూ నాన్ లోకల్ నేతలు జగన్‌పై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల నాలుగో కృష్ణుడు లాంటి వారంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని విభజించి, వైఎస్సార్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలో చేరారని విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునే వారు ఇక్కడకు వచ్చి మాట్లాడుతున్నారని మంత్రి రోజా అన్నారు. సంక్రాంతి అల్లుళ్ళులాగా వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆవిడ వేషం కాంగ్రెస్, స్క్రిప్ట్ చంద్రబాబుది అంటూ విరుచుకుపడ్డారు.
షర్మిల మాటలకు విలువ లేదన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేదని.. ఇప్పుడు ఆమె మాటలకు అర్థం లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. టీడీపీ, జనసేనకు అభ్యర్థులు లేరని మంత్రి ఆర్కే.రోజా పేర్కొన్నారు.