komati-ktr
తెలంగాణ రాజకీయం

బావ బామ్మర్డులిద్దరికీ  మతి భ్రమించింది

కేటీఆర్ అహంకారం తగ్గించుకుంటే మంచిదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం అయన నల్గోండలో పర్యటించారు. మంత్రి మాట్లాడుతూ  కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్  రెడ్డి సరిపోడని నీచంగా మాట్లాడటం తగదు.  దొంగ దీక్షలు – దోపిడీ పాలన తప్ప తెలంగాణ కు కేసీఆర్ ఎం చేసిండని ప్రశ్నించారు. సీఎం పోస్ట్ కేసీఆర్  భిక్ష అని హరీష్ రావు పిచ్చి కామెంట్లు మానుకోవాలె. బావ బామ్మర్డులిద్దరికీ అధికారం పావడంతో  మతి భ్రమించింది.  కె సి ఆర్ అనే వ్యక్తి  రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోడు.  కష్టపడి జెడ్పి్టిసి గా, ఎమ్మెల్సీ గా, ఎంపీ గా సిఎం గా ఎదిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి .  బిఆరెస్ పార్టీ ని ప్రజలు మూసి  నదిలో విసిరి కొట్టిండ్రు.  నిమ్స్ లో  కెసిఆర్ దీక్ష హెల్త్ రిపోర్ట్స్  – నా హెల్త్ రిపోర్ట్స్  ప్రజల ముందు పెడదాం.  హరీష్ రావు గ్యాస్ నూనె పోసుకొని అగ్గిపెట్టె దొరకలేదని నాటకాలాడి 11 వందల మంది అమాయక బిడ్డల ఉసురు పోసుకున్నడు.  

10 సంవత్సరాల బిఆర్ స్ పార్టీ పాలనలో  ఒక్క రేషన్ కార్డు ఇయ్యాలే, ఒక్క ఆరోగ్యశ్రీ కార్డు ఇయ్యాలే, ఒక్క  డబుల్ బెడ్ రూమ్  ఇల్లు ఇయ్యాలె.  మేనేజ్ మెంట్ కోటాలో వచ్చి  ఉద్యమకారుడు  కె.కె. మహేందర్ రెడ్డి ని  ముంచి కేటీఆర్ ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇవ్వాల కష్టపడి రాజకీయాల్లో ఎదిగిన రేవంత్ రెడ్డి ని, నన్ను పట్టుకొని పిచ్చి కామెంట్లు చేస్తున్నాడని మండిపడ్డారు.  ఇట్లాంటి పిచ్చి రాజకీయాలు చేస్తే ప్రజలు తరిమి తరిమి కొడతరని అన్నారు.