జాతీయం ముఖ్యాంశాలు

జ‌మ్ము న‌గ‌రంలో భారీ వ‌ర్షం

ఈరోజు జ‌మ్ముక‌శ్మీర్‌లోని జ‌మ్ము న‌గ‌రంలో భారీ వ‌ర్షం కురిసింది. దాంతో శుక్ర‌వారం రాత్రి వ‌ర‌కు ఎండ‌లు, ఉక్క‌పోత‌తో ఉక్కిరిబిక్కిరైన న‌గ‌రం ఒక్క‌సారిగా చ‌ల్ల‌బ‌డింది. నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌వేశంలో జ‌మ్ములో వ‌ర్షం ప‌డింద‌ని, మ‌రో రెండు మూడు రోజులు కూడా అక్క‌డ వాన‌లు ప‌డే అవ‌కాశం ఉన్న‌ద‌ని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ఈ రోజంతా జ‌మ్ము న‌గ‌రంపై ఆకాశం మేఘావృత‌మై ఉంటుంద‌ని, అక్క‌డ‌క్క‌డ చిరుజ‌ల్లులతోపాటు కొన్ని ప్రాంతాల్లో వ‌ర్షం కూడా ప‌డే అవ‌కాశం ఉన్న‌ద‌ని తెలిపింది.