నెల్లూరు జిల్లా కొండాపురం మండలం చింతల దేవి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు సమక్షంలో సుమారు 150 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కేంద్రం మంత్రి వెంకయ్య నాయుడు సహకారంతో చింతల దేవి కామధేను క్రాస్ బీడింగ్ ప్రాజెక్టుకు 250 కోట్ల నిధులు బొల్లినేని రామారావు కృషిని గ్రామస్తులు కొనియాడారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని రాబోయే టీడీపీ గవర్నమెంట్ లో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని బొల్లినేని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఓంకార్ గ్రామ టిడిపి నాయకులు చిన్నయ్య నరసింహులు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.