rajadhani files-politics
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

తెరపైకి రాజధాని ఫైల్స్

రాజధాని ఫైల్స్ పేరుతో తెరెక్కిన ఓ సినిమా ఇప్పుడు రాజకీయవర్గాలలోనూ సంచనలం అవుతోంది.   దర్శకుడు భాను తెరకెక్కించిన సినిమా రాజధాని ఫైల్స్‌. నటుడు వినోద్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా అరుణప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం తమ భూముల్ని త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదన నేపధ్యంలో తెరకెక్కింది. ఇటీవల విడుదలైన రాజధాని ఫైల్స్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.  రాజధాని ఫైల్స్ ట్రైలర్ కూడా ఆసక్తికరకంగా సాగింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, వారి జీవితాల్ని చాలా సహజంగా చూపించారు. కష్టపడమని చెప్తే.. ఎవడైనా ఇష్టపడతాడా? సుఖాన్ని నేర్పి పడుకోబెట్టాలి, ప్రజలెప్పుడూ మన దగ్గర చెయ్యి చాచి అడుక్కునే పరిస్థితుల్లోనే ఉండాలి, 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశానికి ఒక్క రాజధాని, 6 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి 4 రాజధానులా, ఇది రాజ్యాంగబద్ధమా, వ్యక్తిగత ద్వేషమా.. అంటూ సాగిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.   ఇది పూర్తిగా కల్పిత కథ అని చెబుతున్నప్పటికీ.. ఏపీలో జరుగుతున్న  రాజధాని రాజకీయంపై సినిమా అని ట్రై్ర చూస్తే అర్థమవుతుంది.   పర‌దాల ముఖ్య‌మంత్రి అంటూ నేరుగా విమ‌ర్శ‌నా బాణాన్ని ఎక్కు పెట్టారు.  కాసినోలు, బాబాయ్ – గొడ్డ‌లి ఎపిసోడ్లూ అన్నీ ఈ ట్రైల‌ర్‌లో క‌నిపిస్తున్నాయి. క‌చ్చితంగా రాజ‌కీయ దుమారాన్ని రేపే కంటెంట్ ఈ క‌థ‌లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.          భాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి ర‌విశంక‌ర్ నిర్మాత‌. అఖిల‌న్‌, వీణ‌, వినోద్ కుమార్, వాణీ విశ్వ‌నాథ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందించారు. ఈనెల 15న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈనెల 9న ‘యాత్ర 2’ విడుద‌ల అవుతోంది. తర్వాత వారానికే ఈ సినిమాను విడుదల చేయనున్నారు