badwel-tdp
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

వైసిపి నాయకత్వ "నిర్లక్ష్య"ధోరణితో….

బద్వేల్ నియోజకవర్గం లో వైసీపీ నాయకత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల తెలుగుదేశం  పార్టీలోకి రోజురోజుకు వలసలు పెరిగిపోతున్నాయి .గత 20 సంవత్సరాల నుంచి వైసీపీకి పెట్టని కోటగా ఉన్న బద్వేలు నియోజవర్గం 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జేజిక్కించుకునే విధంగా కనిపిస్తోంది . వైసీపీలో అవలంబిస్తున్న నాయకత్వ నిర్లక్ష్యం వల్లనే టిడిపి నేడు రోజు,రోజుకుపుంజుకుంటుంది .20 సంవత్సరాల నుంచి అధికారం లేక కొట్టుమిట్టాడుతున్న టిడిపి నాయకత్వానికి ఈ ఎన్నికలు ఊరట కలిగిస్తాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. వైసీపీలో వర్గ పోరు ఎక్కువైందని వారికి వారే కొట్టుకుంటున్నారని ఇదే మాకు ప్లస్ పాయింట్ గా మారిందని టిడిపి నాయకులు అంటున్నారు. ఇంట్లో వాడు పెట్టే కంట్లో పుల్ల అన్నట్లు గోవింద్ రెడ్డి నమ్ముకున్న వ్యక్తులే వైసిపికి నేడు నమ్మకద్రోహులయ్యారు. వారు చేస్తున్న అరాచకాలతోనే మిగిలిన నాయకులు విసిగి వేసారి పోయి నేడు తెలుగుదేశం పార్టీ పంచకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు .ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోకి మేము వస్తాము అంటే మేము వస్తాము అని ముందుగానే అక్కడ ఎవరికి వారు సంప్రదింపులు జరుపుకుంటున్నారు .

దీనికంతటికీ కారణం వైసీపీలో కరెంట్ షాక్ వల్లనే ఇలా జరుగుతోందని తెలుస్తోంది . రేపు మాపో అసమ్మతి వర్గంలోని దాదాపు 70 శాతం మంది ద్వితీయశ్రెనినాయకులు దేశం పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కలసపాడు మండలంలోని మాజీ జెడ్పిటిసి దాదన భూపాల్ రెడ్డి బి కోడూరు మండలంలోని మాజీ మండలాధ్యక్షురాలు భర్త శేషారెడ్డి రంగసముద్రం ఎంపీటీసీ రమణ వారి అనుచర వర్గం తో పాటుమరో కొంతమంది నాయకులు తెలుగుదేశం లో చేరిపోయారు .వారి బాటలోనే మరో కొంతమంది నాయకులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీకి గత 20 సంవత్సరాల నుంచి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నైరాశంలో పడిపోయిన సమయంలో ప్రస్తుతం వైసీపీ అంతర్గత కలహాల వల్ల తెలుగుదేశంపార్టీ దూసుకెళ్తోంది. దీనంతటికీ కారణం  వైసీపీలో పుట్టిన వర్గ విభేదాలు కారణం ఈ నియోజకవర్గంలో వైసిపి అధిష్టాన వర్గం దృష్టి సారించకపోవడంతో ఎవరికి వారు వర్గాలుగా ఏర్పడి నేడు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు .

ఇప్పటి కూడా వైసిపి అధినాయకత్వం ఈ నియోజకవర్గంలో ఇసుమంత మాత్రమేనా దృష్టి సారించకపోవడంతో , రేపు జరగబోయే జనరల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నాయకులు గెలుపే ప్రధానంగా అన్ని వర్గాలను కలుపుకొని పోయి కృషి చేస్తున్నారు .తాము అధికారం కోల్పోయి చాలా కాలమైందని ఈదప ఎటువంటి పరిస్థితుల్లోనైనా గెలవాలని ఆ పార్టీ నేతలు ఎనలేని కృషి చేస్తున్నారు .ఇందులో భాగంగానే వైసీపీలో ఉన్న అసమతి వర్గాన్ని తమ వర్గంలో చేర్చుకునేందుకు తహతహలాడుతూ దొరికిన వారిని దొరికినట్టు ఎత్తుకెళ్లిపోయి కండువాలు కప్పుతున్నారు ,అంటే అవతలి పార్టీ వారు గెలుపే ప్రధానంగా పనిచేస్తున్నప్పుడు మరి అధికార పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు ఉన్నవారు మనవారు పోయిన వారందరూ పొరుగువారు అన్నట్లుగా వైసిపి నాయకత్వం తయారయింది .ఇటీవల కాలంలో తెలుగుదేశం యువ నాయకుడు రితీష్ రెడ్డి చేసిన పాదయాత్ర వల్ల ఆ పార్టీకి ఎంతో మేలు చేకూరుస్తోంది .అట్లూరు మండలం రెడ్డి పల్లె వద్ద నుంచి కలసపాడు మండలం రెడ్డిపల్లి వరకు యువ నాయకుని పాదయాత్ర ప్రభావం ఎంతో చూపుతోంది .

ఆయన పాదయాత్రతో యువతలో ,నాయకులలో ఎంతో నమ్మకం ఏర్పడింది .దీన్ని జీర్ణించుకోలేని కొందరు తెలుగుదేశం నాయకులు రితీష్ రెడ్డి పై అవాకులు,చవాకులు పేలారు.వారందరి మాటలు గాలికి పోయిన దూదిపింజల ఎగిరిపోయాయి వారందరూ చేస్తున్న పోరాటం పేలాల కోసమే అని తేలిపోయింది. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆమె కుమారుడు రితీష్ రెడ్డి అహర్నిశలు కష్టపడుతూ పనిచేస్తున్నప్పటికీ కలస్పాడు నుంచి అట్లూరు వరకు మింగుడు పడని కొందరు తెలుగుదేశం నాయకులు, కొత్తగా వచ్చిన కొందరు నాయకులు, కొత్త బిచ్చగాడికి పొద్దెరగనట్లుగా వ్యవహరిస్తూ వారి భగీరథ ప్రయత్నానికి వివాదం కల్పించేందుకు ప్రయత్నించినప్పటికీ వారు మొక్కవోని వైనంతో ఎంతో చాకచక్యంతో వారిదైన శైలిలో అందరినీ కలుపుకొని పోయి ప్రత్యర్థి పార్టీలోని అసమ్మతి వర్గ నాయకులను గుంజుకుంటూ ,పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

ఈ నేపథ్యంలో రితీష్ రెడ్డికి కడప ఎంపీ స్థానం కేటాయిస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ తల్లి కొడుకులు ఇరువురు బద్వేల్ నియోజకవర్గం లో పార్టీ పటిష్టం కోసం అహర్నిశలు పాటు పడుతున్నారు. ఈసారి ఏది ఏమైనా తాము అధికారంలోకి రావాలని వారి ప్రయత్నం .ఆ ప్రయత్నంలో భాగంగానే వారికి కలిసొస్తున్న మరో కోణం వైసీపీలో పుట్టిన ముసలం. మరో అదృష్టం ఏమిటి అంటే కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరిన విజయ జ్యోతి తనకే టికెట్ అనడం ,మాజీ ఎమ్మెల్యే కమలమ్మ కూడా తనకే టికెట్ అని, దాంతో ఆ పార్టీలో కూడా వర్గ పోరు మొదలైంది.
కాంగ్రెస్ పార్టీ వల్ల తెలుగుదేశానికి నష్టం లేకపోయినప్పటికీ, వారు చీల్చుకునే ఓట్లలో దేశానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. దీంతోతల్లి కొడుకులు ఇరువురు ప్రత్యర్థి పార్టీలైన వైసిపి కాంగ్రెస్ ల నుంచి నాయకులను గుంజుకొని సొమ్ము  చేసుకునేందుకు ఎంతో తాపత్ర పడుతున్నారు. ఇప్పటికే దాదాపు 20 శాతం మంది అసమ్మతి నేతలను దేశం పార్టీలోకి ఎత్తుకెళ్లిపోయారు. మిగిలిన 50 శాతం మంది రేపా మాపో అంటూ దేశం నేతల పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాన్ని మానుకొని రాజకీయాల్లోకి వచ్చిన బొజ్జ రోషన్నకు అదృష్టం దురదృష్టంలాపట్టింది .తల్లి కొడుకుల పట్టుదలతో రోషన్నకు ఎక్కడో అదృష్టం వెలిగిపోతోంది .ఇక్కడ రోశన్న అభ్యర్థి అయినప్పటికీ పోటీ మాత్రం విజయమ్మ ఆమె కుమారుడు రితీష్ రెడ్డి ,గోవింద్ రెడ్డి కె .పాత కాపులు అమీ తుమి తేల్చుకునేందుకు వారి వారి వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికలలో  వైకాపా అభ్యర్థి దాసరి సుధానా?
కాదా అనే విషయం తేలవలసి ఉంది బొజ్జ రోషన్న ను అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది అనే విషయం పై పాత కాపులు తేల్చాల్సి ఉంది. ఇందులో ఏ ఒక్కరు కూడా దేనికి వెనకాడకుండా ఎవరి ప్రయత్నం వారు చేస్తూనే ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ వారు మాత్రం ఈ దఫా తమకు చావో రేవో అన్నట్లు అధికారం కోసం దేనికైనా “సిద్ధం”అనే టైపులో ముందుకు వెళ్తున్నారు .వైసిపి వారు మాత్రం ఎవరు గెలిస్తే మాకెందుకు మాకు ఉండే పదవులు మాకు ఉంటాయి మా అధికారం మాకు ఉంటుంది ఎవరు ఎమ్మెల్యే అయితే మాకేంటి అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎప్పటినుంచో వైసీపీలో ఉన్న నాయకులు ఒక్కొక్కరు చేజారిపోతున్నా వారిని నివారించేందుకు కాస్తయినా ప్రయత్నించని నాయకత్వాని ఏమనాలో తెలియటం లేదని బద్వేల్ నియోజకవర్గం ప్రజలు అంటున్నారు. “ఏ టి ” అంగడి వద్ద చూసుకున్నా ,పదిమంది పోగైనచోటచుసినా ఈసారి రోషన్నకు విజయమ్మ పుణ్యాన అదృష్టం పట్టిందని అనుకోవటం వినిపిస్తోంది అంటే ఆమె పార్టీ గెలుపు కోసం ఎంత కృషి చేస్తుందో ప్రజలకు అర్థం అయిపోయింది. వైసీపీలో వర్గ పోరే ఇందుకు కారణం, అని, వారు ఒకటిగా పని చేయలేరని ,ఉన్నవారిని నిలబెట్టుకోలేరని ,అంతా అయిపోయింది అంటున్నారు .

తాలూకాలోనే కాదు ఎక్కడ చూసినా దేశం కొనసాగుతోందని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీదే అధికారమని ప్రచారం జరుగుతూ ఉండటంతో తాము కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఏమి లబ్ధి పొందలేకపోయామని వేధింపులే ఎక్కువయ్యాయని ఇలాంటి సమయంలో తామెందుకు ఈ పార్టీలో ఉండటం గెలిచే పార్టీకి జై అంటే సరిపోతుంది కదా, అనే ఉద్దేశంతో అక్కడ ముందస్తుగా సీటు రిజర్వ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అక్క మీ పార్టీలోకి మేము వస్తాము మాకు కూడా సముచిత స్థానం కల్పించండి అంటున్నారని ప్రజలు అనుకుంటున్నారు .ఎంతమంది వచ్చినా అందరికీ న్యాయం చేస్తామని తమ పార్టీ అధికారంలోకి రావాలని ఆమె అంటున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇరువురు కొట్లాడుకుంటే మూడో వానికి లాభం అన్నట్లుగా దేశం పార్టీ వారు లాభపడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎవరో అన్నట్లుగా రెండు కోతులు కొట్లాడుకుంటూ ఉంటే మూడో కోతి వచ్చే రొట్టె ఎత్తుకెళ్లినట్లు నేడు బద్వేల్ తాలూకాలో పరిస్థితి తయారయింది. అధికార పార్టీలో నాయకులు ఆధిపత్యం కోసంకొట్లాడుకుంటూ ఉంటే, ప్రతిపక్ష పార్టీ వారు వేచి చూస్తున్నారు .ఇదంతా పాలక పక్షానికి బాగా తెలుసు కానీ వారు మారరు ఆ పార్టీ  పతనం కాక తప్పదు అని నియోజకవర్గ ప్రజలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు .చూద్దాం ఎప్పుడు ఏమి జరుగుతుందో అని రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు అంటున్నారు