టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 11 నుంచి శంఖారాం కార్యక్రమం ప్రారంభిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షడు కింజరాపు అచ్చన్నాయుడు అన్నారు.
జగన్ రెడ్డి కుట్రలు..కుతంత్రాలతో చంద్రబాబు జైలుకు వెళ్లడంతో యువగళం పాదయాత్ర అనుకున్నవిధంగా ముందుకుసాగలేదు. యువగళం యాత్ర సాగని నియోజకవర్గాలు మొత్తం చుట్టివచ్చేలా నారా లోకేశ్ శంఖారావం పేరుతో భారీ బహిరంగసభల ద్వారా ప్రజలతో మమేకం కానున్నారని అయన అన్నారు. కుటుంబసాధికార సారథి నుంచి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వరకు ప్రతి టీడీపీ కార్యకర్తతో సభల్లో లోకేశ్ సమావేశమవుతారు. 120 నియోజకవర్గాల్లో 40 రోజుల పాలు శంఖారావం కార్యక్రమం కొనసాగుతుంది. రా..కదలిరా సభలు ముగిశాయి..త్వరలోనే టీడీపీ అధినేత రోడ్ షో ల ద్వారా ప్రజల్లోకి వెళ్తారు. కేసుల భయంతో 5 ఏళ్ల నుంచి జగన్ రెడ్డి కేంద్రప్రభుత్వ పెద్దల కాళ్లపై పడుతూనే ఉన్నాడు. తనపై ఉన్న అవినీతి కేసుల విచారణ పున:ప్రారంభమై ఎక్కడ మరలా తాను జైలుకు వెళ్లాల్సి వస్తుందోనన్న భయంతో జగన్ వణికిపోతున్నాడని అన్నారు.
టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక వైసీపీ ఫేక్ ఫెలోస్ కు ఎలా బుద్ధి చెప్పాలో అలా చెబుతాం. జగన్ రెడ్డి తన స్వార్థానికి దళితయువకుడు శ్రీనివాస్ బలిచేసి 5ఏళ్లు జైల్లో మగ్గిపోయేలా చేశాడు. కోడికత్తి శ్రీనివాస్ కు బెయిల్ రావడం నిజంగా సంతోషకరం. అమాయకుడిని రక్షించడం ద్వారా న్యాయవ్యవస్థపై ప్రజలకున్న గౌరవం మరింత పెరిగిందని అన్నారు.