శుభాకాంక్షలు తెలిపిన రాష్ర్టపతి
ఓడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర ఈరోజు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా జగన్నాథుని రథయాత్రను ఒడిశా ప్రభుత్వం ఈ ఏడాది పూరీకే పరిమితం చేసింది. గతేడాది మాదిరిగానే భక్తులు లేకుండా రథయాత్ర కొనసాగనుంది. రథయాత్ర నేపథ్యంలో పూరీలోని అన్ని దారులను మూసివేసి, రాకపోకలను రద్దు చేశారు. రేపు రాత్రి 8 గంటల వరకు పూరీలో కర్ఫ్యూ విధించారు. పూరీలోకి ఇతర ప్రాంతాల నుంచి భక్తులు రాకుండా ఉండేందుకు కర్ఫ్యూ విధించింది ఒడిశా ప్రభుత్వం.
ఈ సందర్భంగా భక్త జనకోటికి రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా ఒడిశాలోని భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథుడి ఆశీర్వాదంతో.. దేశ ప్రజలందరూ జీవితాంతం ఆనందంతో, ఆయురారోగ్యాలతో నిండి ఉండాలని కోరుకుంటున్నానని రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు.