జాతీయం ముఖ్యాంశాలు

రాజకీయాల్లోకి రావడం లేదు: ర‌జ‌నీకాంత్‌

ఫ్యాన్స్‌ క్లబ్‌గా కొనసాగింపు

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ సోమవారం ‘రజినీ మక్కల్‌ మండ్రం’ నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం లో ఆయ‌న మాట్లడుతూ..భ‌విష్య‌త్తులో రాజ‌కీయ ప్ర‌వేశం చేయ‌బోన‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌కు అలాంటి ఉద్దేశం లేద‌న్నారు. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం లేదని మరోసారి స్పష్టం చేశారు. రజినీ మక్కల్‌ మండ్రంను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. “రజిని మక్కళ్‌ మండ్రం నిర్వాహకులకు, సభ్యులకు, నన్ను బతికిస్తున్న దేవుళ్లయిన అభిమానులకు నా నమస్కారం. నేను రాజకీయాల్లోకి రాలేకపోతున్నానని స్ప‌ష్టం చేశారు.

ఇవాళ అన్ని జిల్లాల‌కు చెందిన ర‌జినీ మ‌క్క‌ల్ మంద్రం ఆఫీసు బేర‌ర్‌ల‌తో భేటీ అయ్యారు. 70 ఏళ్ల ర‌జ‌నీకాంత్ గ‌త ఏడాది రాజ‌కీయ పార్టీ ఆవిష్క‌రించే దిశ‌గా అడుగులు వేశారు. కానీ 2020 డిసెంబ‌ర్‌లో ఆ ఆశ‌ల‌పై నీళ్లు పోశారు. పొలిటిక‌ల్ పార్టీ స్టార్ట్ చేయ‌డం లేద‌ని చెప్పారు. ఆరోగ్యం రీత్యా రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌నుకున్న‌ట్లు వెల్ల‌డించారు. క‌రోనా చికిత్స‌ త‌ర్వాత అమెరికా వెళ్లి కొంత విశ్రాంతి తీసుకున్న ర‌జ‌నీ మ‌ళ్లీ ఇటీవ‌ల చెన్నై చేరుకున్నారు. అయితే రాజ‌కీయాల్లోకి ఎంట‌ర్ కావ‌డం లేద‌ని ఇవాళ మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.

అంతేకాదు రజినీ మక్కల్‌ మండ్రంను ఫ్యాన్స్‌ క్లబ్‌గా కొనసాగిస్తున్నట్లు తెలిపాడు. ఇక అనారోగ్యం రీత్యా రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ప్రకటించిన సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌.. తాజాగా మరోసారి చర్చల నేపథ్యంలో ఊహాగానాలు రావడంతో ఇలా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.