revanth
తెలంగాణ రాజకీయం

కొడంగల్ లో రేవంత్ పర్యటన

కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. కొడంగల్ లో వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలల పనులకూ శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్‌ రెడ్డి. నియోజకవర్గంలో మొత్తం రూ.4369.143 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.  హెలికాఫ్టర్ లో కోస్గి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. కోస్గి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మైదానంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి అనంతరం వారికి బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేశారు.

అయితే.. 2009లో తొలిసారి కొడంగ‌ల్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఈ పథకం సాధనకు రేవంత్‌ ఎంతో ప్రయత్నించారు. ఆయ‌న పోరాటంతో 2014లోనే ఈ ప‌థ‌కం అమ‌లు చేయాల‌ని అప్పటి ఉమ్మడి రాష్ట్ర గ‌వ‌ర్నర్‌ జీవో కూడా జారీ చేశారు. రూ.2945.50 కోట్లు ఖర్చయ్యే ఈ పథకానికి ప‌రిపాల‌న ప‌ర‌మైన అనుమ‌తులు ఇస్తూ తెలంగాణ సర్కార్‌, ఈ నెల 8న జీవో జారీ చేసింది.