జిల్లాలోని 0 – 5 సంవత్సరాల లోపు పిల్లల అందరికి పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్. జి.లక్ష్మిశ పేర్కొన్నారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం హల్ నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి,డి ఈ ఓ.శేఖర్,స్త్రీ శిశు సంక్షేమ శాఖ పిడి జయలక్ష్మి డి ఐ ఓ.శ్రీనివాసులు లతో కలసి మార్చి 3 న (ఆదివారం) నిర్వహించే జాతీయ పోలియో కార్యక్రమానికి సంబందించి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ తో నిర్వహించిన సమావేశం లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య, విద్య,స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయం చేసుకొని జిల్లాలో 0 – 5 సంవత్సరాల లోపు పిల్లల అందరికి వందకు వంద శాతం పల్స్ పోలియో చుక్కల వేయించాలని సంబందించిన అధికారులను ఆదేశించారు. జిల్లాలో 0 – 5 సంవత్సరాల లోపు 2,53,282 మంది పిల్లలకు 3,36,860 డో సులు రావడం జరిగిందని. జిల్లాలో మొత్తం1824 పల్స్ పోలియో కేంద్రాలు.అందులో అర్బన్ లో 427,రూరల్ లో 1397 కేంద్రాలు, 83 మొబైల్ వాహనాలు, 185 రూట్లు,59 ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు,7774 మంది సిబ్బంది ప్రతి పల్స్ పోలియో కేంద్రం లో నాల్గురు చొప్పున సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్కువ మంది ప్రజలు ఉండే ప్రాంతాలలో ప్రత్యేకంగా పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, మాల్స్ దగ్గర, కార్మికులు పనిచేసే ప్రాంతాలలో కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. మార్చి 3 న వేసుకొని పిల్లలకు 4, 5 తేదీలలో సిబ్బంది ప్రతి ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయాలన్నారు. పోలియో చుక్కలు వేసిన పిల్లలకు మార్క్ చేయాలని, పోలియో చుక్కలు వేసిన తర్వాత ఏమైనా ఇబ్బందులు కలిగితే వెంటనే వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డి యం.& హెచ్ ఓ ను ఆదేశించారు.
అంగన్వాడీ సిబ్బంది,ఆశ వర్క్స్,ఏ.యన్.యం లుపల్స్ పోలియో కార్యక్రమం గురించి ముందుగానే ప్రజలకు తెలియజే సే విదంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా అర్బన్,రూరల్ అంగన్వాడీ కేంద్రాల లోని పిల్లల పై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. 0 -5 సంవత్సరాల లోపు పిల్లల కు పోలియో చుక్కలు వేయించాలన్నారు.
గతం లో పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో ఏమైనా సమస్యలు జరిగి ఉంటే వాటిని పరిశీలించుకోవలన్నారు.మార్చి 2 న మళ్ళీ ఒక్కసారి పల్స్ పోలియో కార్యక్రమానికి సంబందించి యంపీడీవోలు,మెడికల్ ఆఫీసర్లు తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు.
ఈ సందర్భంగా పల్స్ పోలియో చుక్కల కు సంబంధించి గోడ పత్రికను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య,విద్య,స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.