ప్రస్తుతం నరేంద్ర మోడీ జీ -20 సదస్సులో ఉన్నారు.. బ్రెజిల్ లో జరుగుతున్న ఈ సదస్సులో ప్రధాని ప్రపంచాధినేతలను కలిశారు. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్మార్టర్ తో భేటీ అయ్యారు..బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్మార్టర్ తో భేటీ లో వ్యాపార అంశాలను తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక నేరగాళ్లపై అప్పగింతపై మాట్లాడారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ని అప్పగించాలని కోరారు. దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని స్మార్టర్ దృష్టికి తీసుకువచ్చారు.. అయితే వారిని చాలా కాలంగా స్వదేశానికి తీసుకురావడానికి భారత్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. న్యాయపరమైన లొసుగల వల్ల వాళ్లు కొంతకాలంగా అక్కడే ఉండిపోతున్నారు. అయితే ఈసారి వాటిపై నరేంద్ర మోడీ మరింతగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. జీ – 20 సదస్సులో ఇదే విషయాన్ని మోడీ స్పష్టం చేశారు. ” ఆర్థిక నేరగాళ్లను స్వదేశానికి రప్పించడానికి భారత్ కృషి చేస్తోంది. దీనిపై అనేక దేశాలతో చర్చలు జరుపుతోంది.
పన్నులు ఎగవేయడం.. మనీలాండరింగ్ కు పాల్పడటం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ బండారి వంటి నేరగాళ్లను సైతం స్వదేశానికి రప్పించడానికి కృషి చేస్తున్నామని” మోడీ పేర్కొన్నారు.. నరేంద్ర మోడీ ప్రస్తావించిన నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకు ను మోసం చేశారు. 13వేల కోట్లకు నిండా ముంచారు. 2018 నుంచి ఆయన లండన్ లో ఉంటున్నారు.. అయితే బ్రిటన్ నీరవ్ మోడీని భారతదేశానికి అప్పగించడంలో అనేక రకాలైన న్యాయపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక విజయ్ మాల్యా 9000 కోట్ల బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి 2016లో లండన్ పారిపోయాడు. అతనిపై అరెస్టు వారెంట్లు జారీ అయినప్పటికీ ఇంతవరకు అతడిని ప్రభుత్వం భారత్ కు అప్పగించలేదు.. ఇక ఇటీవల బ్రిటన్ కోర్టు నీరవ్ మోడీ అప్పగింత దరఖాస్తును తోసిపుచ్చింది. కోర్టు తిరస్కరించినప్పటికీ.. అతడిని భారత్ అప్పగించడానికి.. భారత చేసిన అభ్యర్థనను వర్గంలోకి తీసుకుంటామని బ్రిటన్ ప్రభుత్వం చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే న్యాయ ప్రక్రియలు సంక్లిష్టంగా ఉండడం.. నేరపూరితమైన కేసుల పరిశీలన లో జాప్యం వంటివి ఈ ప్రక్రియను రోజురోజుకు జటిలం చేస్తున్నాయి.
ఇక ఇటీవల బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ నీరవ్ మోడీ, విజయ్ మాల్యా కేసులను ప్రస్తావించారు..” మా దేశంలో ఆర్థిక నేరగాళ్లు ఉండకూడదు. ఆర్థిక నేరగాళ్లకు మా దేశం స్థావరం కాదని” పేర్కొన్నారు. అలాంటి నేరగాళ్లను వారి స్వదేశాలకు పంపించడానికి తాము సహకరిస్తామని అప్పట్లోనే జాన్సన్ ప్రకటించారు. ఆ తర్వాత ఇటలీ ప్రధానమంత్రి జార్జియో మెలోనిని కలిశారు. వాణిజ్యం, పెట్టుబడులు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి వాటి విషయాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ద్వైపాక్షిత వాణిజ్య విషయంలో కీలక చర్చలు జరిపారు. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్, ఇటాలియన్ ఇండస్ట్రీస్ ఫర్ ఫెడరేషన్ ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ వంటి వాటి విషయాలలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తీవ్రవాదానికి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించాలని.. భవిష్యత్తు కాలంలో రెండు దేశాలు సంయుక్తంగా పనిచేయాలని నిర్ణయించారు. సముద్రం, భూతల వ్యాపారాలలో సంయుక్తంగా సహకరించుకోవాలని ఒప్పందానికి వచ్చారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక వ్యాపార భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించారు.