railway-modi
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

మారిపోతున్న  రైల్వేస్టేషన్లు…

భారతీయ రైల్వేలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం బిజీగా ఉన్నారు. సెమీ హైస్పీడ్ రైళ్లను నడపడం ద్వారా భారతీయ రైల్వేల సామర్థ్యాన్ని పెంచారు. ముఖ్యంగా రైల్వే మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అమృత్ భారత్ స్టేషన్ల ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యునికేషన్ క్యాంపెయిన్ కింద  భారతీయ రైల్వేలకు ప్రధాని మోదీ పెద్ద బహుమతి ఇవ్వనున్నారు. అదే సమయంలో మేక్ ఇన్ ఇండియా వందే భారత్ రైలు కూడా 5 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది.దేశవ్యాప్తంగా కొనసాగుతున్న 2000కు పైగా రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపన చేస్తారు. ఇందులో ముఖ్యంగా అమృత్ స్టేషన్, ROB, RUB ఉన్నాయి.దేశవ్యాప్తంగా 553 రైల్వే స్టేషన్లు , 1,500 రోడ్డు ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ల పునరాభివృద్ధికి పునాది రాయి వేయనున్నారు. 26 ఫిబ్రవరి, 2024 సోమవారం రోజున మధ్యాహ్నం 12.30 గం।టలకు దేశవ్యాప్తంగా రూ.41,000 కోట్ల విలువ గల సుమారు 2000 రైల్వే మౌళిక సౌకర్యాల కల్పన ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా జాతికి అంకితం చేయనున్నారు.

ప్రధాన మంత్రి తరచుగా రైల్వే స్టేషన్లలో ప్రపంచ స్థాయి సదుపాయాల కల్పన ఆవశ్యకతను ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. ఈ దిశగా ఆయన అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథక కింద 553 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేయడం పెద్ద ముందడుగు. 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న ఈ స్టేషన్లను రూ.19,000 కోట్లతో పునరాభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ స్టేషన్లు నగరాల ఇరువైపులను కలుపుతూ ‘సిటీ కేంద్రాలుగా’ వ్యవహరిస్తాయి. ఈ స్టేషన్లలో రూఫ్‌ ప్లాజా, సుందరీకరణ, అంతర్గత మోడల్‌ అనుసంధానం, మెరుగుపరిచిన ఆధునిక ముఖద్వారాలు, పిల్లల ఆటస్థలం, కియోస్క్‌లు, ఫుడ్‌ కోర్టులు వంటి సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఇవి పర్యావరణహితంగానూ, దివ్యాంగులకు సౌకర్యవంతగానూ తీర్చిదిద్దుతున్నారు. ఈ స్టేషన్‌ భవనాలను స్థానిక సంస్కృతి, వారసత్వం, రూపశైలితో కూడి ఉంటాయి., ప్రధాన మంత్రి రూ.385 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేయబడిన ఉత్తరప్రదేశ్‌, గోమతి నగర్‌ రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తారు. భవిష్యత్తులో ఈ రైల్వే స్టేషనులో పెరుగనున్న ప్రయాణికుల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని స్టేషన్‌కు వేర్వేరు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేయడం జరిగింది.

సెంట్రల్‌ ఎయిర్‌కండిషనింగ్‌ చేయబడిన ఈ రైల్వే స్టేషనులో ఎయిర్‌ కాంకోర్స్‌, సాఫీ రాకోకలు, ఫుడ్‌ కోర్టులు, సరపడా పార్కింగ్‌ ప్రదేశాల వంటి ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది.ప్రధాన మంత్రి 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా రూ.21,520 కోట్ల వ్యయం కాగల 1500 రోడ్డు ఓవర్‌ బ్రిడ్జిలు, అండర్‌ పాస్‌లకు కూడా శంకుస్థాపన, ప్రారంభోత్సవం ద్వారా జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు రైలు ప్రయాణంలో రద్దీని తగ్గించడమే కాకుండా భద్రత, అనుసంధానంలో పెంపుదల, సామర్థ్యంలో పెరుగుదల, సమర్థతను పెంచుతాయి.