తెలంగాణ ముఖ్యాంశాలు

ప్రారంభమైన రాష్ర్ట మంత్రివ‌ర్గ స‌మావేశం

ప్రారంభమైన రాష్ర్ట మంత్రివ‌ర్గ స‌మావేశం

సీఎం కెసిఆర్ అధ్య‌క్ష‌త‌న రాష్ర్ట మంత్రివ‌ర్గ స‌మావేశం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప్రారంభ‌మైంది. ఉద్యోగ నియామకాలు, కృష్ణా జల వివాదాల అంశాల‌తో పాటు ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చిస్తున్నారు. వీలైనంత త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యంగా సీమ ఎత్తిపోతలను అడ్డుకొనేందుకు ఎలాంటి పద్ధతులు అనుసరించాలన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.

ఇందులోభాగంగా భూముల విలువను సవరించాలనే ఆలోచనకు వచ్చింది. దీనిపై ఏర్పాటుచేసిన క్యాబినెట్‌ సబ్‌కమిటీ చేసిన ప్రతిపాదనలపై చర్చించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ కరోనా థర్డ్‌వేవ్‌ వస్తే ఎదుర్కోవడానికి సంసిద్ధతపై చర్చించనున్నది. వానకాలం సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు ఎంతమేరకు సిద్ధంగా ఉన్నాయి, కల్తీ విత్తనాల నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారు. జూలై 1నుంచి 10వ తేదీ వరకు జరిగిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సమీక్షిస్తారు. ఈ స‌మావేశానికి మంత్రులంద‌రూ హాజ‌ర‌య్యారు.