kavitha-ED
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

కవితకు షాక్.. తప్పదా

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు మరో బిగ్ షాక్ తగలనుంది. ఇటీవల సీబీఐ ఇచ్చిన నోటీసుల ప్రకారం కవిత సోమవారం సీబీఐ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆమె విచారణకు రాలేనంటూ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో న్యాయవిచారణకు దిగిన సీబీఐ అధికారులు.. లీగల్ అడ్వైస్తీసుకొని తదుపరి కార్యాచరణకు దిగాలని భావిస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ తో రాజకీయంగా ఎన్నో అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవితను ఈడీ విచారణ పేరుతో హడావుడి చేస్తే.. మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్న తరుణంలో ఇప్పుడు సీబీఐ నోటీసులతో హడావుడి చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇప్పుడైనా కవితను అరెస్ట్ చేస్తారా? లేదా? ఇదంతా బీజేపీ గేమ్ ప్లాన్ లో భాగమా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇక తాజాగా బండి సంజయ్ స్వరం మార్చడంతో చాలా అనుమానాలే రేకెత్తుతున్నాయి. అసలు గతంలో ఎప్పుడూ కవితను అరెస్ట్ చేస్తామని బీజేపీ చెప్పలేదు. ఈడీ, సీబీఐలతో బీజేపీకి సంబంధాలుండవని బండి ఇప్పుడు చెప్పడం వెనుక కొత్త స్ట్రాటజీ ఏమైనా ఉందా అనే అనుమానాలు మొదలయ్యాయి మరోవైపు ఇప్పుడు కాని కవితను అరెస్ట్ చేస్తే.. బీఆర్ఎస్ కు సానుభూతి పవనాలు వీచడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ కు ఈడీ 7 సార్లు సమన్లు ఇచ్చింది. అయితే వాటి బేఖాతరు చేస్తూ వస్తున్న కేజ్రీవాల్ కేంద్రంపై రివర్స్ ఫైట్ కు దిగారు. కవిత కూడా ఈడీ మహిళలను కార్యాలయానికి పిలిచి విచారించడమేంటని.. సుప్రీంలో సవాలు చేసింది. దాన్ని అడ్డుగా పెట్టుకున్న కవిత ఆ తీర్పును బట్టి తాను సీబీఐ విచారణకు హాజరు అవుతానని ఇప్పుడు మెలిక పెట్టింది. ఈ నేపథ్యంలో కేంద్రం చేతిలో దర్యాప్తు సంస్థలు కీలుబొమ్మలుగా మారాయనే వాదనకు బలం చేకూరుతోంది. మొత్తంగా ఈ కేసులో ఏదో ఒక నిర్ణయం వెలువడేదాకా ఉత్కంఠ కొనసాగనుంది.