వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విజయవాడలో బీజేపీ అగ్రనేతల్లో ఒకరు అయిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యేందుకు ప్రయత్నించారు. ఆయన విజయవాడ పర్యటనకు రావడంతో.. కాపు రామచంద్రారెడ్డి విజయవాడలో ఆయన బస చేసిన హోటల్ వద్దకు వెళ్లారు. కాపు రామచంద్రారెడ్డి సీనియర్ నాయకుడు. సీఎం జగన్ కు నమ్మిన బంటు. కానీ జగన్ ఆయనకు టికెట్ నిరాకరించారు. తనకు సీటు ఇవ్వకపోవడంపై సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గరే రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నీకు గుడ్ బై అంటూ సీఎం క్యాంప్ కార్యాలయానికి సెల్యూట్ చేశారు. జగన్ నమ్ముకుని వచ్చినందుకు తమ జీవితాలు నాశనం అయ్యాయని వాపోయారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. షర్మిల పిసిసి పగ్గాలు అందుకోవడంతో ఆమె వెంట నడుస్తారని టాక్ నడిచింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఆశీర్వాదం తీసుకోవడంతో.. కాంగ్రెస్ లో చేరిక లాంఛనమేనని ప్రచారం జరిగింది.కానీ ఎందుకో ఆ పార్టీలో చేరలేదు.కొద్దిరోజుల కిందట కాపు రామచంద్రారెడ్డి మెత్తబడినట్లు వార్తలు వచ్చాయి. తిరిగి ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆయన వ్యాఖ్యానాలు కొనసాగాయి.
జగన్ పై తాను విమర్శలు చేయనని కూడా ఆయన చెప్పుకొచ్చారు. వ్యతిరేక ప్రచారం చేయనని కూడా అన్నారు. అయితే ఈరోజు విశాఖ పర్యటనకు వచ్చిన రాజ్ నాథ్ సింగ్ కు కాపు రామచంద్రారెడ్డి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పురందేశ్వరి దగ్గరుండి ఆయనను కేంద్రమంత్రి తో కలిపించారు. ఆయన కుటుంబ సమేతంగా వచ్చి కలవడంతో.. తప్పకుండా బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలుగుదేశం, జనసేనల మధ్య పొత్తు కుదిరింది. బిజెపి సైతం కూటమిలోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో వైసిపిలో టిక్కెట్ దక్కని చాలామంది నాయకులు బిజెపికి టచ్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే బిజెపిలో ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. అందుకే బిజెపి అగ్రనేతలు ఎవరికీ హామీ ఇవ్వడం లేదు. కానీ పొత్తు వ్యవహారం తేలాక చేరికలపై బీజేపీ దృష్టి పెట్టి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కాపు రామచంద్రారెడ్డి చేరిక విషయంపై ఒకటి, రెండు రోజుల్లో క్లారిటీ రానున్నట్లు సమాచారం.అయితే ఆయనను అనుమతించలేదని తెలుస్తోంది.
ఏపీ బీజేపీ నేతలతో మాట్లాడి వచ్చారు. రాజనాథ్ సింగ్ ను కలిసేందుకే వచ్చాననని.. మా జిల్లాకు సంబంధం లేని మీటింగ్ ఇక్కడ జరుగుతుంది.. అందుకే మీటింగ్ లో నుంచి బయటికి వచ్చేశానని మీడియాతో చెప్పారు. ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరాలో పూర్తి గా ఏ నిర్ణయం తీసుకోలేదని.. స్పష్టం చేశారు. కానీ వైసిపి ని పూర్తిగా వదిలేశాను… ఆ పార్టీ తో నాకు సంబంధం లేదన్నారు. వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేస్తున్నానని.. ఏ పార్టీ అనేది త్వరలో చెబుతానన్నారు. మంగళగిరిలో జరుగుతున్న వైసిపి మీటింగ్ నుంచి నాకు ఎటువంటి సమాచారం లేదని.. రాజ్ నాధ్ సింగ్ ను మర్యాద పూర్వకంగా కలిసేందుకు వచ్చానన్నారు. త్వరలోనే అన్నివిషయాలు వివరిస్తానని.. ఆ తరువాత రాష్ట్రం లో పరిస్థితులు పై మాట్లాడతానని చెప్పుకొచ్చారు. కాపు రామచంద్రారెడ్డి గతంలో కాంగ్రెస్ లోచేరాలని అనుకున్నారు. మడకశిర వెళ్లి రఘువీరారెడ్డితో సమావేసం అయ్యారు. రానున్న ఎన్నికల్లో కాపు రామచంద్రారెడ్డి, తన భార్య కాపు భారతి రెడ్డి రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పోటీలో ఉంటామని చెబుతున్నారు. కాంగ్రెస్ లో చేరాలని అనుకున్నా.. మళ్లీ బీజేపీ వైపు చూస్తున్నారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కాపు రామచంద్ర రెడ్డికి వైఎస్ జగన్ కూడా పలుమార్లు టిక్కెట్ ఇచ్చారు. వైఎస్ఆర్సిపీ ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చిన నేతగా గుర్తింపు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాపు రామచంద్ర రెడ్డి కి టికెట్ ఇవ్వటం కుదరదు అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలపడంతో కాపు రామచంద్ర రెడ్డి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తాడేపల్లి సీఎంవో కార్యాలయం నుంచి బయటకు వచ్చి సీఎం క్యాంప్ ఆఫీసుకు సెల్యూట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి నమ్మించి గొంతు కోశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీలో టిక్కెట్ ఇచ్చినా చేరేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీఏ పార్టీ నుంచి ఆయనకు ఆహ్వానం అందడం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనపై పెద్దగా ఆసక్తి చూపించ లేదు. బీజేపీ పొత్తులు పెట్టుకుంటే.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆ పార్టీ నుంచి టీడీపీ మద్దతుతో బీజేపీ తరపున పోటీ చేయవచ్చన్న ఆలోచనతో ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. అయితే ఏపీ బీజేపీ నేతలు ఆయనను పట్టించుకోలేదు.