బాపట్ల జిల్లా మేధరమేట్ల జాతీయ రహదారి వద్ద మార్చి 3 న నిర్వహించ తలపెట్టిన సిద్ధం సభ మార్చ్ 10వ తేదీన జరిపాలని పార్టీ నిర్ణయించిందని వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. సిద్ధం సభలకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది. మేధరమేట్ల సిద్ధం సభకు వచ్చేందుకు ఇప్పటివరకు 7 లక్షల పైగా ఇప్పటి వరకు సంసిద్ధత తెలిపారు. మొత్తం 15 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నామని అన్నారు.
98 ఎకరాలలో సభ ప్రాంగణంలో సభను ఏర్పాటు చేస్తున్నాం. పార్కింగ్ కోసం కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. 6 జిల్లాల గుంటూరు,బాపట్ల, పల్నాడు, ప్రకాశం,నెల్లూరు,తిరుపతి పార్లమెంటు జిల్లాల నుండి పెద్ద ఎత్తన ప్రజలు హాజరవుతారు. ప్రభుత్వ పధకాలు ,పాలన పై పార్టీ కేటర్,ప్రజలకు అధినేత జగన్మోహన్ రెడ్డి సభలో దిశా నిర్ధేశం చేస్తారు. మార్చీ13,14 తేదీలలో ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశం. ఏప్రిల్ రెండో వారం లో ఎన్నికలు ఉండవచ్చు. సిద్ధం సభలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చూస్తాం. పేద వర్గాల తో పాటు అగ్రకులాల లో కూడా వైస్సార్సీపీ పై అపూర్వ స్పందన ఉంది. ప్రభుత్వం పథకాలు గురించి సిద్ధం సభల్లో వివరిస్తున్నామని అన్నారు.
గతంలో ఏ రాజకీయ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ చేయని విధంగా జగన్ ప్రభుత్వం పాలన చేసింది. ప్రజల స్పందన చూస్తే 175 కి 175 సీట్లు వస్తాయనే నమ్మకం మాకు ఉంది. మేధరమేట్ల సిద్ధం సభలో 3 గంటలకు ముఖ్యమంత్రి ,పార్టీ అధినేత ప్రసంగిస్తారు, 5 గంటలకు సభ ముగుస్తుంది. మేనిఫెస్టో పై కసరత్తు జరుగుతోంది. మేనిఫెస్టో అతి త్వరలో విడుదల చేస్తాము. సిద్ధం సభలోపే అన్ని సీట్లు ప్రకటించడం జరుగుతుంది. పొత్తులు ఎవరు పెట్టుకున్నా ..ప్రజలు మా వైపే వున్నారని అయన అన్నారు.