thummala
తెలంగాణ రాజకీయం

కేటీఆర్ వచ్చినా వాళ్ళ నాయన కెసిఆర్ వచ్చినా..

కేటీఆర్ వచ్చినా వాళ్ళ నాయన కెసిఆర్ వచ్చినా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం లో గెలుపు కాంగ్రెసు పార్టీదేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.  గురువారం రాత్రి  కె.పి.హెచ్.బి కాలనీలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు.
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 17 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు . నీళ్లు  నిధులు  నియమాకాల పేరుతో  ఏర్పడిన తెలంగాణను  బిఆర్ఎస్ పార్టీ ఆదోగతి, అప్పుల పాలు చేసిందని ఆయన ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ ప్రతి నెల మొదటి రోజు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేలా, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళుతుంది తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పాలనను చూసి భయపడుతున్న బిఆర్ఎస్ నాయకులు పనిరాని ఛాలెంజ్ లు విసురుతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అన్ని పార్లమెంట్ స్థానాలను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.