24 గంటల్లో కొత్తగా 41,806 నమోదు
దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,806 కేసులు నమోదయ్యాయి. 581మంది మృతి చెందారు. కరోనా నుంచి 39,310మంది కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,09,87,880కి చేరింది. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 3,01,43,850 గా ఉంది. . 4,32,041 యాక్టివ్ కేసులు ఉన్నాయి.