గొర్రెల స్కీమ్ పారదర్శకంగా గొర్రెలని పంపిణీ చెయ్యాలని, ఎక్కడ బ్రోకర్లకు తావులేకుండా గొర్ల కాపర్లకు గొర్రెలు ఇవ్వాలని ఉద్దేశంతో స్కీమ్ మొదలైన విషయం తెలిసిందే.గొర్రెల పంపిణీ కేసులో మరో కుంభకోణం బయటపడింది. లోలోన కంపెనీ బాగోతాలు బట్టబయలయ్యాయి. లోలోన కంపెనీ ప్రభుత్వ స్కీముకే గండి కొట్టేలా బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్కీములో యూనిట్ కాస్ట్ పెంచకుండా ఎంట్రీ ఇచ్చింది లోలోన కంపెనీ. రూ.20 వేలు ఆఫర్ అని, లాభం పొందవచ్చని లోలోన ఆఫర్స్ ఇచ్చింది బోగస్ కంపెనీ లోలోన బ్రోచర్స్ బయటకు వచ్చాయి. ఎలాంటి మార్గదర్శకాలు, గ్రౌండ్ రిపోర్టు లేకుండా ఇష్టాను రీతిలో స్కీమ్ యూనిట్ కాస్ట్ పెంచింది. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు మోహినుద్దీన్, ఇక్రముద్దీన్. లోలోన ఎండీ మోహినుద్దీన్ 7 బోగస్ కంపెనీలను మెయింటైన్ చేస్తున్నారు. లోలోన బ్రోకర్ కంపెనీ అని తెలిసే రైతులకు గొర్రెలను పంపిణీ చేశారు వెటర్నరీ అధికారులు.
లోలోనతో కుమ్మక్కై స్కీమును స్కాముగా మార్చారు వెటర్నరీ శాఖలోని ఉన్నతాధికారి ఒకరు. లోలోన కంపనీ ప్రతినిధులు అడ్రెస్ లేకుండా పరారయ్యారు. గత ప్రభుత్వ పెద్దల హస్తంతోనే లోలోన కంపెనీ గొర్రెలు కొనిస్తామంటూ ఎంట్రీ ఇచ్చారు.గొర్రెల పంపిణిలోనే నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. గొర్రెల స్కీమ్ పారదర్శకంగా గొర్రెలని పంపిణీ చెయ్యాలని, ఎక్కడ బ్రోకర్లకు తావులేకుండా గొర్ల కాపర్లకు గోర్రెలు ఇవ్వాలని ఉద్దేశంతో స్కీమ్ మొదలైన విషయం తెలిసిందే. ఏసీబీ లోలోన కార్యకలాపాలపై దృష్టి సారిస్తే అసలు బండారం బయటపడుతుంది. గొర్రెల కొనుగోలులో బ్రోకర్లకు వెటర్నరీ వైద్యులు ఎలా ఎంట్రీని ఇచ్చారో తెలియాల్సి ఉంది.గత ప్రభుత్వ పెద్దలైన ఇద్దరు మంత్రులతో మోహినుద్దీన్ నేరుగా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. వెటర్నరీ ఉన్నతాధికారి సూచనలతోనే రాష్ట్రవ్యాప్తంగా లోలోన కంపెని బ్రోకర్లతోనే గొర్రెలు కొనుగోలు చేశా వెటర్నరీ వైద్యులు. గొర్లకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి తిండి, తిప్పలు లేక ఇబ్బందులు పడి గతిలేని స్థితిలో లోలోన బ్రోకర్ కంపెనీ ఇచ్చిన నాణ్యత లేని గొర్లను తెచ్చుకున్నారు గొర్లకాపర్లు.రైతులకు మెడికల్, లజిస్టిక్స్ ఇవ్వడంలోనూ భారీ కొత పడింది.
రూ.100 కోట్లకు పైగా స్కామ్ జరిగిందంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటివరకు రంగారెడ్డి రైతులకు కొనిచ్చిన గొర్ల విషయంలో వాటిని అమ్మిన రైతులకు అందాల్సిన డబ్బులను బినామీలకు పంపారు వెటర్నరీ అధికారులు. బినామీల ఖాతాల్లోకి మళ్లింపు విషయంలోనూ దర్యాప్తు చేస్తోంది ఏసీబీ. గొర్రెల స్కీమును స్కాముగా మార్చిన డేటాను లోలోన వ్యవహారాలను బయటపెడితే అసలు తతంగం బయటపడే అవకాశం ఉంది.