దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం ( Fire accident ) చోటుచేసుకుంది. బొరివాలీ ఏరియాలో ఓ బహుళ అంతస్తుల భవనంలోని ఏడో ఫ్లోర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు స్థానికుల సాయంతో మంటలు ఆర్పారు. పెద్ద ఎత్తున ఎగిసిపడిన ఈ మంటలను ఆర్పడానికి మూడు గంటలకుపైగా సమయం పట్టింది.
కాగా, మంటలను ఆర్పే క్రమంలో అగ్నిమాపక శాఖకు చెందిన ఓ అధికారికి గాయాలయ్యాయి. దాంతో ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.