revanth
తెలంగాణ రాజకీయం

ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

భద్రాచలం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గ్రౌండ్ లో జరిగిన ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు, ఎమ్మెల్యేలు,అధికారులుహ జరయ్యారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో పేదవాళ్లు రాసుకుని గుర్తుంచుకునేది ఈ రోజు.  దశాబ్ద కాలంగా పేదలు ఎదురుచూస్తున్న సొంతింటి కలను సహకారం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ప్రకటించిన గ్యారెంటీ  అమల్లో భాగంగా భద్రాద్రి, శ్రీ సీతారామచంద్రుల స్వామి పాదాల సన్నిధిలో ఈరోజు అధికారికంగా ఇందిరమ్మ ఇండ్ల గృహ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.
గత ప్రభుత్వ హయాంలో ఇంటి పత్రాలు పొందని వారికి సైతం ఈరోజు భద్రాద్రి రాముడు సాక్షిగా ఇంటి పత్రాలను అందజేస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న పేద బడుగు బలహీన వర్గాలు ఇందిరమ్మ ఇండ్లను ఈరోజు రాములవారి సన్నిధి నుంచి రాష్ట్ర ప్రజలు పొందడం శుభ దినం. గత పది సంవత్సరాలు పరిపాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అటకెక్కించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల గురించి గత బిఆర్ఎస్ పాలకులు చాలా అపహస్యంగా మాట్లాడారు. అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటాడు.. బిడ్డ వస్తే ఎక్కడ ఉంటది.. బర్రెను ఎక్కడ కట్టాలి గొర్ల మేకలను ఎక్కడ పెట్టాలి అంటూ చాలా చులకనగా అపహస్యం చేస్తూ మాట్లాడిన కేసీఆర్ రెండు గదుల ఇల్లు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలు బిఆర్ఎస్ కోసమో..  బిఆర్ఎస్ మెప్పుకోసమో ప్రకటించినవి కావని అన్నారు.
కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలను పక్కదారి పట్టించిన గత బిఆర్ఎస్ పాలకులు.  కాంగ్రెస్ ఇచ్చిన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఆరు గ్యారెంటీలను ఎన్నికల ముందు ప్రకటించాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఆరోగ్య శ్రీ పథకాన్ని ఐదు లక్షల నుంచి 10 లక్షల కు పెంచడం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు జీరో బిల్లు అమలు చేశాం. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేస్తూ భద్రాద్రి రాముడు సన్నిధి సాక్షిగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఈరోజు ప్రారంభించాం. దళిత గిరిజనులకు ఇల్లు కట్టుకోవడానికి ఆరు లక్షల రూపాయలు, మిగతా వర్గాలకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాం. బిఆర్ఎస్ మాదిరిగా హామీలు ఇచ్చి విస్మరించం. బడ్జెట్లో నిధులు కేటాయించిన తర్వాతే పథకాలను ప్రారంభిస్తున్నామనిఅన్నారు.
రాష్ట్ర బడ్జెట్ పూర్తి స్థాయిలో పెట్టుకోకున్నప్పటికీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు కేటాయించాం. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఓటన్ అకౌంట్ బడ్జెట్లో 7740 కోట్ల రూపాయలు కేటాయించాం. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీల హామీల అమలుకు ఆశా, మాషీగా వ్యవహరించడం లేదు. నిధులు కేటాయించకుండా పథకాలు ప్రారంభించడం లేదు. రెండు గదుల ఇల్లు ఇస్తానని ప్రజలను మోసం చేసిన చరిత్ర ఉన్న బిఆర్ఎస్ కాంగ్రెస్ పై విమర్శలు చేయడం విడ్డూరమని అన్నారు.
కాంగ్రెస్ ప్రకటించిన హామీలకు నిధులు కేటాయించి పథకాన్ని ప్రారంభించడమే ఇందిరమ్మ రాజ్యానికి బిఆర్ఎస్ కు ఉన్న తేడా. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రూపాయి, రూపాయి పోగు చేసి ప్రతి పైసా ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ఖర్చు చేస్తుంది. యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకుని భద్రాచలం వచ్చి రాములవారి ఆశీర్వాదం తీసుకొని పేదల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న ఈ ప్రభుత్వం ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది. భద్రాద్రి దేవాలయమైన పరిసర ప్రాంతాలైన గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లోనే అభివృద్ధి జరిగింది. భద్రాద్రి లో ఏర్పాటు అయిన విద్యా, వైద్య సంస్థలు ,ప్రజలకు అందుతున్న మంచినీళ్లు, గోదావరి పైన నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిలు పరిసర ప్రాంతాల అభివృద్ధి కాంగ్రెస్ హయాం లోనే జరిగింది. భద్రాద్రి పరిసర అభివృద్ధికి 1000 కోట్లు,  రాముల వారి ఆలయ అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు ఇస్తామని మాటలు చెప్పి పైసా ఇవ్వకుండా గారడి మాటలతో ప్రజలను గత ప్రభుత్వం మభ్యపెట్టింది. భద్రాద్రి టెంపుల్, భద్రాద్రి ఆలయ పరిసర ప్రాంతాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. యాక్షన్ ప్లాన్ ప్రకారంగా అభివృద్ధి చేస్తామని అన్నారు.