jagan
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ఏపీపీఎస్సీలో రూ.150 కోట్ల కుంభకోణం..

జగన్ రెడ్డి ఏపీపీఎస్సీలో ఉద్యోగాలు అమ్ముకొని 150 కోట్ల భారీ కుంభకోణం చేసి నిరుద్యోగ యువతను మోసం చేశాడని తెదేపా నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానందరెడ్డి. నందికొట్కూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గిత్త జై సూర్య పేర్కొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల నియామకంలో జగన్ రెడ్డి ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరతీసింది. ఒక్కో డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ రూ.2.5 కోట్లకు, ఒక్కో డీఎస్పీ పోస్ట్ రూ.1.5 కోట్లు రూపాయలు అమ్ముకొని నిరుద్యోగ యువతను మోసం చేశాడని, గ్రూప్ 1 మెయిన్స్ లో ప్రభుత్వ అక్రమాలు హైకోర్టులో బహిర్గతం అయింది.గ్రూప్1 మెయిన్స్ లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆ నోటిఫికేషన్ ద్వారా నియామకమై ప్రస్తుతం వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న 162 మంది నియామకాలు చెల్లవని, మళ్లీ మెయిన్స్ పరీక్ష నిర్వహించి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు తీర్పునివ్వడం కూడా జరిగిందని తెలిపారు.

సాంప్రదాయంగా అనుసరిస్తున్న మాన్యువల్ మూల్యాంకనం కాకుండా తమ వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు జగన్ రెడ్డి ప్లాన్ చేసి మరి డిజిటల్ వాల్యూషన్ చేశాడని,తెలంగాణలో ఇదే విధంగా జరిగినపుడు బాధ్యులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని శిక్షించడం జరిగిందని, జగన్ రెడ్డికి ఏ మాత్రం నైతిక విలువలు విశ్వసనీయత ఉన్నా కుంభకోణానికి బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గిత్త జై సూర్యను అఖండ మెజార్టీతో గెలిపించాలని అన్ని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు దిశ నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మూర్తు జావలి భాస్కర్ రెడ్డి గుండం రమణారెడ్డి ప్రభు కుమార్ లాయర్ జాకీర్ జనసేన నాయకులు రవికుమార్. షకిల్ అహ్మద్ గిరీష్ రెడ్డి ప్రతాపరెడ్డి మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు