ts rtc-maha sabha
తెలంగాణ రాజకీయం

ఈ నెల 16, 17 లో టీఎస్ఆర్టీసీ మహాసభలు

ఖమ్మం జిల్లా సీపీఐ కార్యాలయంలో టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ బాబు మాట్లాడారు. 16,17 తేదీల్లో టీఎస్ఆర్టీసీ మహాసభలు నిర్వహిస్తున్నాం, ఈ సభలకు చాలా ప్రాముఖ్యత ఉంది. గత ప్రభుత్వం ట్రేడ్ యూనియన్ మీద ఉక్కుపాదం మోపారు. ఈ మహా సభల్లో కార్మిక సంఘ సమస్యలు అన్నీ పరిష్కరించబడతాయి. ఈ సభల్లో కొన్ని తీర్మానాలు చేస్తాం. కార్మిక వర్గం గురించి పోరాడేది టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మాత్రమే. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వం లో విలీనం అయ్యింది అని గత ప్రభుత్వం జీఓ జారీ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 100 రోజులు అవుతున్న ఇంతవరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయలేదు. ఈ ప్రభుత్వం త్వరితగతిన ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి. గత ప్రభుత్వం నియంత పోకడకు పోతుందని అనుకున్నాం, ఈ ప్రభుత్వం సైతం టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రమేయం లేకుండానే యాజమాన్యాలతో పే స్కేల్ గురించి చర్చలు జరుపుతోంది. ప్రభుత్వం చెప్తున్నట్లు గా ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు పెరగలేదు.

ఆర్టీసీ ఉద్యోగులకు 3 నుండి 4 వేలు మాత్రమే జీతాలు పెరిగాయి, 10 నుండి 20 వేలు పెరగలేదు. ట్రేడ్ యూనియన్ ను ఎక్సిస్టేన్స్ కి తీసుకు వస్తామన్న కాంగ్రెస్ ఆ హామీ నెరవేర్చాలి. ఆర్టీసీ ఉద్యోగులకు 9 డీఏలు బకాయిలు ఉన్నాయి వాటిని ప్రభుత్వం కానీ, యాజమాన్యాలు కానీ చెల్లించలేదు వాటిని వెంటనే చెల్లించాలి, లేనిచో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని అన్నారు.